ETV Bharat / bharat

వందేభారత్​ రైలుపై విరిగిపడ్డ చెట్టు! ప్రారంభించిన కొన్ని గంటలకే ప్రమాదం.. - ఒడిశాలో ఆగిపోయిన వందే భారత్​ ఎక్స్​ప్రెస్​

Vande Bharat Express Accident in Odisha : ప్రధాని మోదీ గురువారమే లాంఛనంగా ప్రారంభించిన వందేభారత్​ ఎక్స్​ప్రెస్​పై చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో రైలు మూడు గంటల పాటు అక్కడే నిలిచిపోయింది. ఆదివారం ఒడిశాలో ఈ ప్రమాదం జరిగింది.

vande-bharat-express-accident-in-odisha-vande-bharat-express-howrah-to-puri-accident
ఒడిశాలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం
author img

By

Published : May 22, 2023, 9:30 AM IST

Updated : May 22, 2023, 10:59 AM IST

Vande Bharat Express Accident in Odisha : భారీ వర్షాలకు చెట్టు కొమ్మలు మూడు విరిగి.. వందేభారత్​ ఎక్స్​ప్రెస్​పై పడ్డాయి. దీంతో మూడు గంటల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది. పూరీ నుంచి హౌరా వెళుతున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్​కు ఈ ప్రమాదం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారమే దీన్ని అధికారికంగా ప్రారభించడం గమనార్హం. ఒడిశాలోని జైపుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

విద్యుత్ లైన్​తో అనుసంధానించే రైలు పాంటోగ్రాఫ్‌లో చెట్టు కొమ్మలు చిక్కుకున్నాయని, ముందు భాగానికి సైతం కొన్ని పగుళ్లు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో రైలును ఆపేసినట్లు వారు వెల్లడించారు. ఘటనలో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4.45 గంటలకు ఘటన జరిగిందని అధికారులు వివరించారు. బైతరణి -మంజురి స్టేషన్ల మధ్య.. జాజ్‌పుర్ కియోంజర్ స్టేషన్ సమీపంలో రైలుపై కొమ్మలు విరిగి పడ్డాయని వారు తెలిపారు.

vande bharat express accident in odisha vande bharat express howrah to puri accident
ఒడిశాలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్​కు ప్రమాదం

"ప్రమాదం అనంతరం దాదాపు సాయంత్రం 8 గంటల సమయంలో రైలు తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. రైలుకు కరెంట్​ సరాఫరా అయ్యే వైర్​ కాస్త డ్యామేజ్​ అయింది. దీంతో డీజీల్​ ఇంజిన్​ సహాయంతో రైలును నడిపించాం. భద్రక్​ ప్రాంతం వరకు రైలు ఇలాగే తీసుకువెళ్లాం" అని అధికారులు తెలిపారు. సోమవారం ప్రమాదం జరిగిన వందేభారత్​ ఎక్స్​ప్రెస్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చిన్న చిన్న రిపేర్ల అనంతరం సేవలు తిరిగి ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. కాగా శనివారం ఈ రైలు తన సేవలను ప్రారంభించింది.

పశువును ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్​ప్రెస్​..
కొద్ది రోజుల క్రితం ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తున్న వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రైలు పశువును ఢీకొట్టింది. గుజరాత్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో గేదేలను ఢీకొట్టడం వల్ల రైలు 20 నిమిషాలు పాటు ఆగిపోయింది. ఈ ఘటన వల్ల రైలు ముందు ప్యానెల్ దెబ్బతింది. దాంతో పాటు మొదటి కోచ్‌లోని అండర్ బెల్లీ పరికరాలు కూడా దెబ్బతిన్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆవును ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైలు..
అంతకు ముందు గాంధీనగర్‌ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. గుజరాత్‌లోని ఆనంద్‌ స్టేషన్‌ సమీపంలో ఓ ఆవును ఢీ కొట్టింది. ఈ ఘటలో రైలుకు పెద్దగా నష్టమేమీ జరగలేదు. రైలు ముందుభాగంలో మాత్రం చిన్నపాటి గంటు ఏర్పడింది. గాంధీనగర్-ముంబయి మధ్య నడిచే ఈ వందే భారత్ సెమీ- హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్టోబర్‌ 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.

Last Updated : May 22, 2023, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.