ETV Bharat / bharat

'ఇకపై టెట్‌ పరిమితి జీవితకాలం'

టెట్​ స్కోర్ కాలపరిమితి ఇక జీవితకాలం ఉండనుంది. ప్రస్తుతం ఏడేళ్ల వరకు ఉన్న మార్కుల విలువను జీవితకాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.

Validity of Teacher Eligibility Test
టెట్‌ కాలపరిమితి
author img

By

Published : Jun 3, 2021, 2:35 PM IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) స్కోర్‌ కాలపరిమితిని జీవితకాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయం ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేవారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు.

ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రస్తుతం దాని మార్కుల విలువ ఏడేళ్ల వరకు ఉంది. ఆలోపు ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుకు ఎంపిక కాకుంటే ఆ పరీక్షను మళ్లీ రాయాల్సిందే. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) తాజాగా టెట్‌ స్కోర్‌ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా నిర్ణయించింది. ఇక నుంచి టెట్‌ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షల మందికి ఊరట కలగనుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీఈ 50వ సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్ణయించారు.

అధిక స్కోర్‌ కోసమే..

బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన వారు టెట్‌ రాయడానికి అర్హులు. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకానికి నిర్వహించే డీఎస్‌సీ/టీఆర్‌టీ రాయడానికి టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇందులో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఒకసారి ఉత్తీర్ణులైనా.. ఎక్కువ మార్కుల కోసం మళ్లీ మళ్లీ రాస్తుంటారు. ఒక్కసారి ఉత్తీర్ణులైతే టెట్‌ స్కోర్‌కు జీవితకాలం విలువ ఇస్తామని తాజాగా నిర్ణయం తీసుకున్నా.. పోటీని తట్టుకొని ప్రభుత్వ కొలువు దక్కించుకోవడానికి అధిక స్కోర్‌ కోసం అభ్యర్థులు ఈ పరీక్షను ఎప్పటికప్పుడు రాస్తూనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అధిక స్కోర్‌ సాధించిన వారు తాజా నిర్ణయం కారణంగా గడువు తీరిపోతుందని పరీక్ష రాయాల్సిన పని ఉండదు.

ఇదీ చూడండి: 'విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత, భవిష్యత్తే ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.