Vadodara NGO Gang Rape: గుజరాత్, వడోదరలో జరిగిన విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయాసిస్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసే యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబరు 29న ఆమెపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇదే విషయాన్ని ఎన్జీఓలో ఉన్న స్నేహితులు, యాజమాన్యంకు బాధితురాలు తెలపగా.. ఎవరూ స్పందించలేదు. అంతేకాక పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువతి నవంబరు 4న వల్సద్ రైల్వేస్టేషన్లోని రైల్వే కంపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వడోదరా జిల్లా క్రైంబ్రాంచ్ ఎసీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.
ఈ ఘటన జరిగిన 38 రోజుల తర్వాత.. ఎన్జీఓలో పనిచేసే ట్రస్టీతోపాటు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
ఇదీ చూడండి: దిల్లీలో ఘోరం.. దివ్యాంగ మహిళపై పలుమార్లు అత్యాచారం