ETV Bharat / bharat

'టీకాతోనే కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ' - vaccine long term immunity

వ్యాక్సిన్ పంపిణీతోనే కరోనాకు వ్యతిరేకంగా దీర్ఘకాల ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని నిపుణులు తెలిపారు. కరోనా సోకిన తర్వాత వచ్చే యాంటీబాడీల రక్షణ కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని చెప్పారు. కాబట్టి వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు.

Vaccination provides most reliable long-term protection against COVID-19: Experts
'టీకాతోనే కరోనాపై దీర్ఘకాల రక్షణ'
author img

By

Published : Feb 23, 2021, 1:03 PM IST

కరోనాకు వ్యతిరేకంగా దీర్ఘకాల రక్షణ సాధ్యం కావాలంటే టీకా పంపిణీనే ఉత్తమ మార్గమమని నిపుణులు స్పష్టం చేశారు. యాంటీబాడీల ద్వారా వచ్చే ఇమ్యూనిటీ కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుందని, టీ-కణాల ద్వారా వచ్చే రోగనిరోధకత దీర్ఘకాలం పాటు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు చెన్నై మ్యాథమెటికల్ ఇన్​స్టిట్యూట్​కు చెందిన రాజీవ కరందికార్, సీఎస్ఐఆర్ డీజీ శేఖర్ మండే, ఐఐటీ హైదరాబాద్​కు చెందిన ఎం విద్యాసాగర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రెండు సీరోలాజికల్ సర్వేలు, ఇతర అధ్యయనాల ప్రకారం.. భారత్​లోని కొంతభాగం జనాభాకు కరోనాకు రోగనిరోధకత ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇది సహజంగా వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం.. యాంటీబాడీల వల్ల వచ్చే ఇమ్యూనిటీ కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది. టీ-కణాల ద్వారా వచ్చే రోగనిరోధకత సుదీర్ఘంగా ఉంటుంది. ఎక్కువకాలం నమ్మకమైన ఇమ్యూనిటీ ఉండాలంటే వ్యాక్సినేషన్ ద్వారానే సాధ్యం."

-నిపుణులు

కొందరు పరిశోధకులు చేసిన అధ్యయనాల ప్రకారం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే రోగనిరోధకత.. మ్యుటేషన్ వైరస్​పైనా తక్కువ ప్రభావవంతంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత మంచిదని అన్నారు. అదే సమయంలో ఇటలీ, యూకే, అమెరికా దేశాల్లోలా కేసులు భారీగా పెరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

ఇదీ చదవండి: ఎర్రకోట ఘటనలో ప్రముఖ ​రైతు నేత అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.