ETV Bharat / bharat

వృద్ధుల్లో నెమ్మదించిన టీకా పంపిణీ.. కారణమదేనా?

author img

By

Published : Jun 27, 2021, 6:44 AM IST

కేంద్రం వ్యాక్సినేషన్​ ప్రక్రియను విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. 60 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ కొద్ది వారాలుగా నెమ్మదిస్తోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్​పై ఉన్న అపోహలు, అనవసర భయాల కారణంగానే వృద్ధులు టీకా తీసుకునేందుకు ముందుకు రావట్లేదని తెలిపారు. అవగాహన పెంచేందుకు కేంద్రం మరింత కృషి చేయాలని సూచించారు.

vaccination of 60 plus population, వృద్ధులకు కరోనా టీకా
టీకా తీసుకునేందుకు మొగ్గు చూపని వృద్ధులు

దేశంలో 60 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ ప్రక్రియ గత కొద్ది వారాలుగా నెమ్మదిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కేవలం 2.29 కోట్ల మంది వృద్ధులే పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారని తన నివేదికలో పేర్కొంది. సింగిల్​ డోసు అందుకున్న వారి సంఖ్య 6.71 కోట్లగా ఉన్నట్లు తెలిపింది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 2 మధ్య వారానికి 80.77 లక్షల సగటున వృద్ధులకు టీకా పంపిణీ జరిగేదని.. జూన్​ 5 నుంచి 25 మధ్య అది 32 లక్షలకు పడిపోయినట్లు పేర్కొంది.

60 ఏళ్లు దాటిన వారు దేశంలో 14.3 కోట్లు ఉంటారని కేంద్రం అంచనా. ఈ లెక్కన ఇప్పటివరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 16 శాతం మాత్రమే.

నిపుణుల ఆందోళన..

వృద్ధుల్లో టీకా పంపిణీ తగ్గడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్​ వ్యాప్తికి 60 ఏళ్లు దాటిన వారే తీవ్రంగా ప్రభావితం అవుతారని తెలిపారు. టీకా పంపిణీ కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడటం సహా వ్యాక్సిన్​పై​ అపోహలే వ్యాక్సినేషన్​ నెమ్మదించడానికి కారణం అని అభిప్రాయపడుతున్నారు.

"కొవిడ్​ వ్యాప్తిపై చాలా మందికి ఇంకా అవగాహన లేదు. ఆ వైరస్​ పట్టణానికే పరిమితం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పలువురు ప్రజల అభిప్రాయం. కొవిడ్​ తమకు సోకదని కొందరు ధీమాగా ఉన్నారు. వ్యాక్సిన్​ తీసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇలా వైరస్​, వ్యాక్సిన్ల పట్ల అనేక అపోహలు, దురాభిప్రాయాలు వ్యాక్సినేషన్​ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తున్నాయి."

-డాక్టర్​ సుజీత్​ రంజన్, సీఎఫ్​ఎన్​ఎస్​ ఎక్జిగ్యూటివ్​ డైరెక్టర్

గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్​ కేంద్రాల వద్ద వృద్ధులకు కనీస సదుపాయాలు కూడా లేవని సుజీత్​ పేర్కొన్నారు.

" హృద్రోగ సమస్య నుంచి కోలుకున్నవారిలో తాము టీకా తీసుకుంటే మళ్లీ సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. వ్యాక్సినేషన్​ కేంద్రాలకు చేరుకోవడంపై కూడా వృద్ధులు ఆసక్తి చూపించట్లేదు. రద్దీగా ఉన్న ప్రాంతాలకు వస్తే కొవిడ్​ సోకుతుందేమోనన్న భయం ఉంది. మరికొందరు వయసు రీత్యా కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారు. ఈ సమస్యలను పరిగణించి కేంద్రం వారికి ఇంటివద్దే టీకా అందించేలా చర్యలు చేపట్టాలి."

-డాక్టర్​ శుచిన్​ బజాజ్​, ఉజాలా సైగ్నస్​ ఆసుపత్రి వ్యవస్థాపకురాలు

కరోనా కేసుల తగ్గుముఖం పడుతున్నా మహమ్మారి సోకే అవకాశం ఉందనే విషయంపై వృద్ధుల్లో అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. మహమ్మారిని కట్టడి చేయాలంటే టీకా తీసుకోవడం ఒక్కటే మార్గమని, దీనికి అడ్డంకిగా మారుతున్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వాలు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : డెల్టా రకంపై కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ భేష్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.