ETV Bharat / bharat

టీకా తీసుకున్నా మళ్లీ వైరస్​ సోకడానికి కారణాలేంటి? - Thirty seven doctors have positive

ఒక వైపు అర్హులందరూ టీకా తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. మరో వైపు టీకా తీసుకున్నా.. కరోనా సోకడం ఆగడం లేదు. పైగా వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో ఇతర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో టీకాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వ్యాక్సిన్​ తీసుకోవాలా? వద్దా? టీకా తీసుకున్నా మళ్లీ వైరస్​ సోకడానికి కారణాలు ఏంటి? తెలుసుకుందాం.

Covieshield
టీకా
author img

By

Published : Apr 16, 2021, 8:50 PM IST

  • దిల్లీలోని సర్​ గంగారామ్​ ఆస్పత్రిలోని 37మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. అందులో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స కోసం గతవారం ఆస్పత్రిలో చేరారు. ఆ డాక్టర్లలో ఎక్కువ మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారే.
  • దిల్లీలో ఇటీవల మొదటి డోసు తీసుకున్న 54ఏళ్ల ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. టీకా వేసుకున్న రోజు నీరసంగా ఇంటికి వచ్చాడని అతడి కుమారుడు ధీరజ్​ అన్నాడు. ఆ తర్వాత విపరీతమైన జ్వరం వచ్చిందని, మూడు రోజులకు చనిపోయినట్లు వివరించారు.
  • చెన్నైలో మార్చిన 15న మొదటి డోసు తీసుకున్న లబ్ధిదారుడికి.. అదే నెల 29న కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఏప్రిల్​ 4న అతడు చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు టీకా సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దిల్లీ, చెన్నైతో పాటు.. పాట్నా లాంటి టైర్​-2 నగరాల్లో ఇలా కరోనా సోకిన వ్యాక్సినేషన్​ లబ్ధిదారుల సంఖ్య నెల రోజులుగా పెరిగిపోతోంది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రారంభమైన తర్వాత లబ్ధిదారుల్లో స్వల్ప ప్రతికూలతలు ఎదురయ్యాయి. కొందరి విషయంలో అవి తీవ్రమై.. ఆస్పత్రిలో చేరడానికి దారి తీసిననట్లు తెలుస్తోంది.

అయితే కేంద్రం మాత్రం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు రెండూ తీసుకోవడం సురక్షితమని చెబుతోంది. దుష్ప్రభావాలు వస్తున్నాయన్న పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరుతోంది.

నిపుణులు ఏమన్నారంటే

టీకాలు వైరస్​ నుంచి రక్షించడానికి పూర్తస్థాయి కవచాన్ని నిర్మించలేవని నిపుణులు అంగీకరించారు. అయితే వైరస్​ తీవ్రతను వ్యాక్సిన్​ తగ్గిస్తుందని, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతుందని వెల్లడించారు.

"టీకా రెండు డోసులను తీసుకున్న వారికి కూడా కరోనా సోకినట్లు మాకు తెలుసు. అయితే వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో వైరస్​ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. లబ్ధిదారులకు కొవిడ్​ సొకితే సంక్రమణ తీవ్రత, ప్రాణాపాయం కూడా తగ్గుతుంది. పూర్తి స్థాయిలో వైరస్​ను ఎదుర్కొనే సామర్థ్యం రెండు డోసులు తీసుకున్న తర్వాతే వస్తుంది."

-డాక్టర్ అవధేష్, పల్మనాలజిస్ట్, అపోలో ఆస్పత్రి​, బన్సల్​

వైరస్​పై పోరాటంలో టీకా ఆయుధం కాదని దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఓ సీనియర్​ డాక్టర్​ చెప్పారు. మాస్క్​ అనే ఆయుధంతోనే వైరస్​ను ఎదుర్కొవచ్చని చెప్పుకొచ్చారు. కొవిడ్​ అనేక రకాలుగా రూపాంతరాలు చెందుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్​తో వైరస్​ను నిర్మూలించలేమన్నారు.

"టీకా తీసుకున్నాక చాలా మంది తాము రోగ నిరోధక శక్తిని పొందామని భావించి.. మాస్క్​ను విస్మరిస్తున్నారు. వైరస్​ మొదట ముక్కు ద్వారా ప్రవేశించి.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి టీకాలు తీసుకున్న తర్వాత కూడా మాస్కులు ధరించాలి. అలా అయితేనే వైరస్​ ఇంకో వ్యక్తికి సోకే అవకాశం ఉండదు. మాస్క్​ కంటే ఉత్తమ టీకా ఇంకోటి లేదు. రెండు డోసులు వ్యాక్సిన్​ తీసుకున్నాక కూడా వైరస్​ సోకుతుంది అంటే.. దానికి అనేక కారణాలు ఉంటాయి. వ్యక్తిగత రోగనిరోధక శక్తి, అంతకుముందున్న అనారోగ్య సమస్యలు తదితర అంశాలు ఆధారపడి ఉంటాయి. "

-సీనియర్​ డాక్టర్​, దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రి

టీకా తీసుకున్నాక కూడా వైరస్​ వల్ల మా కుటుంబానికి బాధలు తప్పడం లేదని భాజపా సీనియర్​ నేత అర్వింద్​ గుప్తా ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. తమ కుటుంబ సభ్యులు రెండు డోసులు తీసుకున్నాక కూడా జ్వరం, ఒంటినొప్పులు, దగ్గు లాంటి సమస్యలతో అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు.

రెండు డోసులు తీసుకున్నాక శరీరంలో ప్రతిరోధకాలు అభివృద్ధి చెందుతాయని, సంక్రమణ తీవ్రత, మరణించే అవకాశాలు తగ్గుతాయని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లక్ష్మీలావణ్య అలపాటి.. గుప్తా పోస్టుకు రిప్లే ఇచ్చారు. టీకా తీసుకున్నవారు.. ఆసుపత్రిలో చేరే అవకాశాల్లో 85శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే శరీరంలోకి వైరస్ రాకుండా టీకాలు నిరోధించలేవని, మాస్క్​ మాత్రమే ఆపగలదని వివరించారు.

వ్యాక్సిన్​ వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్న వార్తలను నిపుణులు తోసిపుచ్చుతున్నారు. వ్యాక్సిన్​ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురైనట్లు ఏ వ్యక్తి విషయంలోనూ రుజువు కాలేదని క్లినికల్​, ఎపిడెమియోలాజికల్​ నివేదకలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మెడికల్ ఆక్సిజన్​ ఉత్పత్తిని పెంచాలి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.