కాలేయంలో ఇరుక్కున్న ఓ పదునైన కత్తిని శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు వైద్యులు. సుమారు గంటన్నర పాటు శస్త్రచికిత్స చేసి కత్తిని బయటకు తీశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కేరాకత్లో జరిగింది. సుమారు 6 సెంటీమీటర్ల పొడవైన ఆ కత్తి ఆరు రోజుల పాటు అతడి కాలేయంలేనే ఉంది.
కెరకట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్బారి గ్రామానికి చెందిన రామాధీన్ అనే వ్యక్తి నవంబర్ 6న తన కుమార్తె సీమంతం వేడుకలకు ఘనంగా ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా డీజే పాటలు పెట్టించాడు. అలా బంధువులంతా డీజే పాటలకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో రామాధీన్ కుటుంబానికి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో యువకుడిని బయటకు నెట్టేశారు రామాధీన్ కుటుంబసభ్యులు. కొంత దూరం వెళ్లిన యువకుడు.. తిరిగి రామాధీన్ కుటుంబ సభ్యులను దుర్భాషలాడటం ప్రారంభించాడు. దీంతో గొడవ ముదిరి పంచాయితీ వరకు చేరుకుంది.
ఈ క్రమంలో వారి మధ్య సంధి కుదిర్చేందుకు సిద్ధమైన గ్రామ పెద్దల ముందు ఆ యువకుడు.. మానస్రామ్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు. కానీ అక్కడి వైద్యులు అతనికి సరైన వైద్య సదుపాయాలు అందించక పోవడం వల్ల రోగి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆందోళన చెందిన కుటంబసభ్యులు అతడిని మరో ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్య పరీక్షలు నిర్విహించగా కాలేయంలో కత్తి ఉందని తేల్చారు. అంతే కాకుండా అతని కడుపునిండా రక్తం పేరుకునిపోయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలను కాపాడారు.
ఇదీ చదవండి:నక్సలైట్ రాజ్యంలో విద్యా కుసుమాలు.. యువత భవితకు దిక్సూచిగా నీతి ఆయోగ్!
ఆ గ్రామంలో పిల్లలకు జన్మనివ్వడం నిషేధం.. ప్రసవిస్తే అంతే.. ఆ శాపమే కారణం..!