ETV Bharat / bharat

స్కూల్​లో పిల్లలకు వ్యాక్సిన్​.. 50 మందికి తీవ్ర అస్వస్థత.. ఏం జరిగింది? - అలీఘడ్​ పిల్లలు

పాఠశాలలో వ్యాక్సిన్​ వేయించుకున్న 50 మంది పిల్లలు అనారోగ్యానికి పాలయ్యారు. వెంటనే తల్లిదండ్రులు స్థానిక ప్రాథమిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారులంతా చికిత్స పొందుతున్నారు. అసలు ఏం జరిగిందంటే?

uttarpradesh-children-sicked-due-to-vaccine

author img

By

Published : Oct 1, 2022, 7:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​ జిల్లాకు చెందిన 50 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. అప్రమత్తమైన తల్లిదండ్రులు.. పిల్లల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే తమ అనుమతి లేకుండా పిల్లలకు పాఠశాలలో వ్యాక్సిన్​ వేయించారని అందుకే వారి ఆరోగ్యం క్షీణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?
జిల్లాలోని థానా దాడోన్​ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సుమారు 150 మందికి ఆరోగ్య సిబ్బంది టీకాలు వేశారు. అయితే ఆ తర్వాత విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లారు. కాసేపటికే 50 మంది పిల్లల ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలతో నీరసంగా తయారయ్యారు. మరికొందరికి తీవ్రమైన జ్వరం వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి తీసుకొచ్చారు.

uttarpradesh-children-sicked-due-to-vaccine
ఆస్పత్రిలో పిల్లలు

అయితే తమ అనుమతి తీసుకోకుండా పిల్లలకు పాఠశాల సిబ్బంది వ్యాక్సిన్​ వేయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్​ గేట్​ మూసివేసి మరీ తమకు టీకాలు వేశారని విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు డిమాండ్​ చేస్తున్నారు.

ఈ ఘటనపై జిల్లా మెడికల్ సూపరింటెండెంట్​ అవనీంద్ర యాదవ్​ స్పందించారు. విద్యార్థులకు టీడీ, డీపీడీ వ్యాక్సిన్లు వేశామని తెలిపారు. అవి వేస్తే సాధారణంగా విద్యార్థులకు జ్వరం వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశామన్నారు.

ఇవీ చదవండి: పాదరక్షల్లో రూ.5కోట్ల కొకైన్.. ఎయిర్​పోర్ట్​లో అడ్డంగా బుక్కై..

కాంగ్రెస్ అధ్యక్ష పోరు ఇద్దరి మధ్యే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.