ETV Bharat / bharat

ఆపరేషన్ సక్సెస్​- సేఫ్​గా బయటకొచ్చిన 41 మంది కూలీలు, 17 రోజుల నిరీక్షణకు తెర

uttarkashi tunnel rescue update today
uttarkashi tunnel rescue update today
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 7:58 PM IST

Updated : Nov 28, 2023, 10:52 PM IST

22:51 November 28

ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులందరూ సురక్షితంగా బయటకు రావడం ఆనందాన్ని కలిగిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 17 రోజుల పాటు రెస్క్యూ సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారని మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా నెరవకుండా విజయం సాధించారని కొనియాడారు. అత్యంత కష్టతరమైన రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించిన బృందాన్ని రాష్ట్రపతి అభినందించారు

21:53 November 28

భావోద్వేగానికి గురి చేసింది : ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్‌ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్​ విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. అందరినీ భావోద్వేగానికి గురి చేసిందని అన్నారు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం, జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణ అని కొనియాడారు. మన ఈ స్నేహుతులు చాలా రోజుల తర్వాత వారి ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తి ఇచ్చే విషయం అని అన్నారు.

ఇది దేశానికి గొప్ప వార్త : అమిత్​ షా
ఉత్తరాఖండ్‌ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు రావడ పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి ఇది గొప్ప వార్త అని అన్నారు. కఠిన సవాలుతో కూడిన పరిస్థితిని ఎదుర్కొన్న బాధితులకు సంకల్పానికి సెల్యూట్ అని ఎక్స్​లో వేదికగా చెప్పారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. ఇప్పుడు ఉపశమనంగా, సంతోషంగా ఉందని తెలిపారు.

20:40 November 28

  • ఉత్తరాఖండ్‌: ఆపరేషన్‌ టన్నెల్‌ విజయవంతం
  • సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల వెలికితీత
  • కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువచ్చిన సహాయ సిబ్బంది
  • బయటకు వచ్చిన కార్మికులకు అంబులెన్సుల్లో ప్రాథమిక చికిత్స

20:27 November 28

ఉత్తరాఖండ్‌ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది మంది కార్మికులు బయటకు వచ్చారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అందరు కార్మికులు బయటకు వచ్చేందుకు సుమారు నాలుగు గంటల సమయం పట్టనుంది.

20:18 November 28

  • ఉత్తరాఖండ్‌: సొరంగం నుంచి కార్మికులను బయటకు తెస్తున్న సహాయ సిబ్బంది
  • కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తున్న సహాయ సిబ్బంది

  • కార్మికుల కోసం 41 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేసిన అధికారులు
  • ఉత్తరాఖండ్‌: 17 రోజులపాటు సొరంగంలో ఉన్న 41 మంది కార్మికులు
  • సొరంగం బయట కార్మికుల కుటుంబాల ఆనందోత్సాహాలు
  • ఘటనాస్థలిలో సహాయ చర్యలు పర్యవేక్షిస్తోన్న ఉత్తరాఖండ్‌ సీఎం

14:38 November 28

ఆపరేషన్ సక్సెస్​- సేఫ్​గా బయటకొచ్చిన 41 మంది కూలీలు, 17 రోజుల నిరీక్షణకు తెర

Uttarkashi Tunnel Rescue Update Today : ఉత్తరాఖండ్ సిల్ క్యారా సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుని నరకం అనుభవిస్తున్న 41 మంది కార్మికులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సహాయక బృందాల సమన్వయంతో కార్మికులను సురక్షితంగా బయటకు వస్తున్నారు. సొరంగం నుంచి వచ్చిన కార్మికులను అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో 16 రోజులుగా అధికారులు నిర్విరామంగా చేపట్టిన సహాయక చర్యలు, లక్షలాది మంది ప్రజల పూజలు ఫలించినట్లైంది. ఒక్కో కూలీని బయటకు తీసుకొచ్చేందుకు కనీసం 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతోంది. మొత్తం 41 మందిని సొరంగం నుంచి బయటకు తీసుకురావడానికి... మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టనుంది.

నేలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయిన చోట నుంచి 12 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్లు (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) తవ్వకం చేపట్టి మిగతా దూరం డ్రిల్లింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి కార్మికలను బయటకు తీసుకువచ్చారు. వారిని బయటకు తీసుకొచ్చిన వెంటనే వైద్య చికిత్స అందించేందుకు తరలించారు. ఇందుకోసం ఇప్పటికే సిల్‌క్యారాకు 30 కిలోమీటర్ల దూరంలో 41 పడకలతో తాత్కాలిక వార్డ్‌ను సిద్ధం చేశారు. కూలీలను తరలించేందుకు సొరంగం వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలుగా రోడ్లను మెరుగుపర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని వాయు మార్గంలో తరలించేందుకు చినూక్‌ హెలికాప్టర్లను కూడా సొరంగం వద్ద సిద్ధంగా ఉంచారు.

Last Updated : Nov 28, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.