ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా ప్రారంభమైంది. హర్ కీ పౌడీ ఘాట్ వద్ద గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు.
ఈ నేపథ్యంలో.. ఐటీబీపీ, సీఏపీఎఫ్ సహా ఆ రాష్ట్ర పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.


సాధారణంగా మూడు నెలలపాటు జరిగే కుంభమేళాను చరిత్రలో తొలిసారిగా నెలరోజులు మాత్రమే నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. అక్కడికి వెళ్లే భక్తులకు కొవిడ్ టెస్ట్‌లు తప్పనిసరి చేసింది. నెగెటివ్ రిపోర్టు ఉన్న వారికి మాత్రమే అనుమతి కల్పిస్తోంది.


ఇదీ చదవండి: ఆ చట్టానికి పాతికేళ్లైనా.. అట్టడుగునే ఆదివాసులు!