ETV Bharat / bharat

'చిరిగిన జీన్స్'​ వ్యాఖ్యలపై సీఎంకు భాజపా సమన్లు

ఉత్తరాఖండ్​ సీఎం తీరథ్​సింగ్​ రావత్​కు భాజపా అధిష్ఠానం సమన్లు జారీచేసింది. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. వాటిపై వివరణ ఇవ్వాలని కోరినట్టు సమాచారం.

Uttarakhand CM Tirath Singh Rawat to meet BJP President JP Nadda in Delhi
సీఎం 'వస్త్రధారణ' వ్యాఖ్యలపై భాజపా సమన్లు
author img

By

Published : Mar 19, 2021, 4:03 PM IST

Updated : Mar 19, 2021, 4:23 PM IST

మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్​ సీఎం తీరథ్​ సింగ్​ రావత్కు సమన్లు పంపింది భాజపా అధిష్ఠానం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రావత్​ దిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నారు.

ఈ ఏడాది మార్చి 10న ఉత్తరాఖండ్​ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రావత్​కు.. ముఖ్యమంత్రి హోదాలో ఇది తొలి దిల్లీ పర్యటన కానుంది.

ఇదీ చదవండి: 'వస్త్రధారణ' వ్యాఖ్యలను సమర్థించిన సీఎం భార్య!

కొద్దిరోజుల క్రితం..​ తాను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చొన్న ఓ మహిళ చిరిగిన జీన్స్‌ ధరించిందని, ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని ఓ సమావేశంలో తీరథ్​సింగ్​ అన్నారు. ఇలాంటి వస్త్రధారణతో సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రిప్డ్ జీన్స్ ధరించిన పోస్టులు కూడా పెడుతూ కొందరు నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్​ సీఎం వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ఇదీ చదవండి: సీఎం వ్యాఖ్యలపై బిగ్​బీ​ మనమరాలు గరం

Last Updated : Mar 19, 2021, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.