ETV Bharat / bharat

60 ఏళ్ల వృద్ధుడి కడుపులో గర్భాశయం.. రిపోర్ట్స్ చూసి డాక్టర్లు షాక్..! - అరవై ఏళ్ల వృద్ధుడి కడుపులో గర్భాశయం న్యూస్

కిడ్నీ సమస్యతో ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధుడి రిపోర్ట్స్ చూసిన వైద్యులు షాక్​కు గురయ్యారు. ఆ వృద్ధుడికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా కడుపులో గర్భాశయం ఉన్నట్లు తేలింది. ఈ అరుదైన సంఘటన బిహార్​ ఛప్రాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే?..

Uterus in stomach of an old man in bihar
అరవై ఏళ్ల వృద్ధుడి కడుపులో గర్భాశయం
author img

By

Published : Feb 27, 2023, 1:46 PM IST

Updated : Feb 27, 2023, 2:02 PM IST

బిహార్​లోని ఛప్రా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కిడ్నీ సమస్యతో ఆస్పత్రికి వచ్చిన ఓ వృద్ధుడికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా కడుపులో గర్భాశయం ఉన్నట్లు రిపోర్టులో వచ్చింది. ఈ రిపోర్ట్స్ చూసిన డాక్టర్లంతా షాక్​కు గురయ్యారు.

ఇదీ జరిగింది..
ఛప్రాలోని కార్పెంటర్ మియాన్ అనే అరవై ఏళ్ల వృద్ధుడికి కిడ్నీ సమస్య వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. దీంతో వైద్యులు అతడికి అల్ట్రాసౌండ్​ స్కానింగ్ పరీక్ష నిర్వహించారు. అనంతరం రిపోర్ట్స్ చూసిన వైద్యులు షాక్​కు గురయ్యారు. వృద్ధుడి కడుపులో గర్భాశయం ఉన్నట్లు ఆ స్కానింగ్ రిపోర్టులో వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న వృద్ధుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. రిపోర్టు చూసిన డాక్టర్లంతా ఈ సంఘటనకు ఆశ్చర్యపోయి.. అతడికి మళ్లీ వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. అనంతరం వృద్ధుడికి మరోసారి వైద్య పరీక్షలు చేయగా.. అతడి కడుపులో గర్భాశయం ఉన్నట్లు కనిపించలేదు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు కాస్త ఊరట చెందారు.

ఈ విషయం పై మాట్లాడిన వైద్యులు రిపోర్ట్స్ తారుమారై ఉంటాయని తెలిపారు. ఇది కేవలం మానవ తప్పిదమే తప్ప స్కానింగ్​లో ఎలాంటి పొరపాటు లేదని చెప్పారు. ఒక మహిళ సిటీ స్కాన్​లో ఉన్న అంశాలన్నీ ఆ రిపోర్టులో ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. "ఇది పూర్తిగా మానవ తప్పితదమే. ఆ రిపోర్టులో గర్భాశయం ఉన్నట్లు ఉంది. పురుషుడికి గర్భాశయం ఉంటే వైద్యం చేయటం సాధ్యం కాదు. రిపోర్ట్స్ మారిపోయి ఉండవచ్చు. అందుకే మేము మళ్లీ అతడికి స్కానింగ్ తీయించాము. తరువాత తీసిన స్కానింగ్​లో వృద్ధుడికి గర్భాశయం ఉన్నట్లు కనిపించలేదు. ప్రస్తుతం ఆ రిపోర్ట్స్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నాము." అని డాక్టర్​ సంతోష్ కుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 27, 2023, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.