ఉత్తర్‌ప్రదేశ్, కాన్పుర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.. తన బంధువైన 25ఏళ్ల యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఏం జరిగిందంటే..?
మీర్జాపుర్ జిల్లాకు చెందిన 25ఏళ్ల యువతి.. తన కుటుంబసభ్యులతో కుంభమేళాలో పాల్గొనేందుకు 2019లో అలహాబాద్‌లో వారి బంధువైన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లింది. అలహాబాద్‌లో ఉన్నప్పుడు.. తనను ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. అలా రెండేళ్లుగా అనేక సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించింది. ఈ క్రమంలో తాను గర్భవతి అయినట్లు తెలపగా.. అబార్షన్ కోసం ఓ పిల్ కుడా ఇచ్చాడని పేర్కొంది.
ఇటీవల ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఆయన కుమారుడితో కలిసి మరోసారి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి వారినుంచి తప్పించుకుని.. చనిపోతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చి గంగానదిలో దూకింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించారు.
ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడినిపై కేసు నమోదు చేసి.. సస్పెండ్ చేశారు పోలీసులు. పూర్తి వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి: నలుగురు కలిసి మహిళను వివస్త్రను చేసి, ఫోన్లో వీడియో తీసి...