ETV Bharat / bharat

రైలులో భారీ అగ్నిప్రమాదం- ప్రయాణికులు సేఫ్​! - train accident news up

UP Train Accident Today : రైలులో మంటలు చెలరేగి ఒక బోగీ పూర్తిగా దగ్ధమైంది. ఉత్తర్​ప్రదేశ్​ ఇటావాలో బుధవారం సాయంత్రం జరిగిందీ ఘటన.

up train accident today
up train accident today
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 6:59 PM IST

Updated : Nov 15, 2023, 10:03 PM IST

UP Train Accident Today : దిల్లీ-దర్భంగా ఎక్స్​ప్రెస్​ రైలులో జరిగిన భారీ అగ్నిప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ ఇటావాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. హమ్​సఫర్ ఎక్స్​ప్రెస్​​ దిల్లీ నుంచి బిహార్​లోని దర్భంగాకు వెళ్తోంది. బుధవారం సాయంత్రం సరాయ్ బోపత్ రైల్వే స్టేషన్​ను దాటుతుండగా ఎస్​1 బోగీ నుంచి పొగ రావడాన్ని స్టేషన్​ మాస్టర్ గమనించారు.

రైలులో మంటలు- ఒక బోగీ దగ్ధం- ప్రయాణికులు సేఫ్​!

వెంటనే లోకోపైలట్​కు సమాచారం ఇచ్చి.. రైలును ఆపేశారు. మంటల వ్యాప్తితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో రైలు నుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. క్షణాల్లోనే మంటలు మరింత తీవ్రమై.. ఎస్​1 బోగీ పూర్తిగా కాలిపోయింది. పక్కనే ఉన్న మరో రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి.

  • VIDEO | Fire breaks out in a train, travelling to Bihar's Darbhanga from New Delhi, in Uttar Pradesh's Etawah. Firemen on the spot. More details awaited. pic.twitter.com/yjVWmUyygU

    — Press Trust of India (@PTI_News) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

UP Train Accident Latest News: ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. మంటలు రావడానికి కారణమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఎస్ఎస్​పీ సంజయ్​ కుమార్​ వర్మ తెలిపారు.

  • #WATCH | Fire broke out in the S1 coach of train 02570 Darbhanga Clone Special when it was passing through Sarai Bhopat Railway station in Uttar Pradesh.

    According to CPRO, North Central Railways, there are no injuries or casualties

    (Earlier Video; Source: Passenger) pic.twitter.com/mTFHcTlhak

    — ANI (@ANI) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే.. ఎస్​1 బోగీ కింద సిలిండర్​ పేలుడు జరిగిందని, ఆ తర్వాత మంటలు చెలరేగాయని ప్రయాణికులు కొందరు చెప్పారు. "మంటలు చెలరేగగానే రైలు కిటికీలో నుంచి మేము ఎలాగో బయటపడ్డాము. రైలులో మంటలు ఆర్పేందుకు సరైన వ్యవస్థ లేదు. బోగీ నుంచి బయటకు వచ్చే క్రమంలో కొందరు గాయపడ్డారు" అని ప్రయాణికుడు ఒకరు మీడియాతో చెప్పారు.

  • VIDEO | "We somehow got out from the window of the coach when the fire broke out there. There were no proper means to extinguish the fire in the coach. Few people were injured while getting out of the coach," says a passenger who was onboard New Delhi-Darbhanga Express. pic.twitter.com/B9dFaYieSq

రైలులో పేలుడు
మరోవైపు.. భగల్​పుర్​-జయ్​నగర్ ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్​లో చిన్నపాటి పేలుడు జరగగా.. ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. బిహార్​లోని సమస్తీపుర్​లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. "మధ్యాహ్నం 1.30కి భగల్​పుర్​-జయ్​నగర్​ ఇంటర్​సిటీ ఎక్స్​ప్రెస్ ఐదో నంబర్ ప్లాట్​ఫాం వద్దకు వచ్చింది. సమస్తీపుర్ సిగ్నల్ దాటాక జనరల్ బోగీలో పేలుడు జరిగింది. ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి దర్భంగా రైల్వే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు" అని సమస్తీపుర్ రైల్వే డివిజన్ డీఎస్​పీ నవీన్ కుమార్ చెప్పారు.

పట్టాలు తప్పిన ఎక్స్​ప్రెస్​ రైలు..
కేరళలో పాలక్కాడ్​ వద్ద నిలంబూర్​ రోడ్​- షోరనూర్​ ఎక్స్​ప్రెస్(రైలు నెం-6474)​ రైలు.. పశువులను ఢీకొట్టడం వల్ల పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Fire In Express Train : ఎక్స్​ప్రెస్​ రైలులో ఒక్కసారిగా మంటలు.. బెంగళూరు స్టేషన్​లోనే

Madurai Train Accident : రైలులో మంటలు.. రామేశ్వరం వెళ్తున్న 10 మంది టూరిస్ట్​లు మృతి.. 20 మందికి గాయాలు

Last Updated : Nov 15, 2023, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.