ETV Bharat / bharat

UP Tractor Accident News : నదిలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి - జమ్ముకశ్మీర్​లో నదిలో పడిన ట్రక్కు

Up Tractor Accident News : 50 మంది భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్.. ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా తొమ్మిది మంది మరణించారు. బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు జమ్ముకశ్మీర్​లో ఓ ఇటుక ట్రక్కు నదిలో పడిపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గురువారం ఈ ప్రమాదం జరిగింది.

up-tractor-accident-news-tractor-falls-into-drain-in-up-several-died
నదిలో పడిపోయిన ట్రాక్టర్ నలుగురు చిన్నారులతో సహా పలువురు మృతి
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 3:14 PM IST

Updated : Aug 24, 2023, 6:15 PM IST

Up Tractor Accident News : ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ నదిలో పడిపోయిన ఘటనలో నలుగురు చిన్నారులు, ఓ మహిళతో సహా.. మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లోని సహరాన్‌పుర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్​లో 50 మంది భక్తులు ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెహత్‌ పరిధిలోని రండోల్ గ్రామంలో ఉన్న జహర్‌వీర్ గోగా జీకి.. పూజలు చేసేందుకు బాధితులంతా ట్రాక్టర్​లో వెళ్తున్నారు. వీరంతా గగల్‌హెడి పోలీస్ స్టేషన్​ పరిధిలోని బలేలి గ్రామానికి చెందినవారు. రెడ్డిబోడ్కి గ్రామ సమీపంలోని ధమోలా నదిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ పడిపోయింది. బాధితుల కేకలు విన్న స్థానికులు.. వెంటనే అక్కడికి చేరుకుని పలువురిని కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

up-tractor-accident-news-tractor-falls-into-drain-in-up-several-died
ఉత్తర్​ప్రదేశ్​ ట్రాక్టర్​ ప్రమాద ఘటన

హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి మరికొందరిని కాపాడారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

నదిలో పడ్డ ఇటుకల లోడ్​ ట్రక్కు.. ముగ్గురు మృతి..
Truck Falls Into River : ఇటుకలతో వెళ్తున్న ఓ ట్రక్కు​ అదుపుతప్పి నదిలో పడిపోయింది. జమ్ముకశ్మీర్​లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఉదంపుర్ జిల్లాలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్రక్కు ఢీకొని మహిళ మృతి..
Truck Hits Bike in Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్​లో ఓ ట్రక్కు.. బైక్​ను​ ఢీకొట్టిన ఘటనలో 50 ఏళ్ల మహిళ మృతి చెందింది. బాద్గావ్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతురాలిని బెల్డా బుగుర్గ్‌ గ్రామానికి చెందిన సావిత్రిగా పోలీసులు గుర్తించారు. సమీప బంధువైన దీపక్​తో కలిసి సావిత్రి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు. ఘటనలో సావిత్రి అక్కడికక్కడే మృతి చెందింది. దీపక్​ గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం అనంతరం ట్రక్కును అక్కడే విడిచి.. డ్రైవర్​ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

కొత్త వందేభారత్ రైళ్లలో విమానం తరహా ఫీచర్​.. బ్లాక్​బాక్స్​ సహా ఇంకెన్నో..

Buildings Collapse In Kullu : హిమాచల్​లో వర్ష బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు

Last Updated : Aug 24, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.