UP Rain News: ఉత్తర్‌ప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు భారీగా ప్రాణనష్టం జరిగింది. వర్షపాతం ధాటికి సోమవారం ఒక్కరోజే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎక్కువ శాతం మరణాలు.. ఈదురు గాలులు, పిడుగుపాటు, వరదల కారణంగానే సంభవించాయి. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆగ్రా, వారణాసి, గాజీపుర్, ప్రతాప్‌గఢ్ సహా 18 ప్రాంతాల్లో వర్షపాతం తీవ్ర ప్రభావం చూపించినట్లు తెలిపారు.
మృతుల కుటుంబసభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వర్షాల బీభత్సం కారణంగా మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. సోమవారం మరో మూడు జంతువులు మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిల కొట్లాట.. వీడియో వైరల్