యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Election 2022) పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థులు.. రూ. 11 వేల కట్టి దరఖాస్తు సమర్పించాలని పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి బ్యాంకు ఖాతాలో ఈ నగదు జమ అవుతుందని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.. ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi news) నేతృత్వంలో జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
''రానున్న అసెంబ్లీ ఎన్నికల(UP Election 2022) కోసం.. అప్లికేషన్లను స్వీకరించే బాధ్యత సంజయ్ శర్మ, విజయ్ బహదూర్ చూస్తారు. ఆశావహులు.. సెప్టెంబర్ 25లోగా రూ. 11 వేలు కట్టి దరఖాస్తు సమర్పించాలి. ఆర్టీజీఎస్, డిమాండ్ డ్రాఫ్ట్, పే ఆర్డర్ ద్వారా నగదు జమ చేయొచ్చు. బ్యాంకు వివరాల్ని కూడా దరఖాస్తుల్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పటి నుంచే ప్రారంభమైంది.''
- యూపీ కాంగ్రెస్ ప్రకటన
403 స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి(UP Election 2022).. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ అతి పెద్ద రాష్ట్రంలో గెలుపు కోసం ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభించాయి ఆయా పార్టీలు.
ఇవీ చూడండి: యోగి సర్కార్‌పై మోదీ ప్రశంసల జల్లు