ETV Bharat / bharat

పోలీసుల దారుణాలు.. బాలికపై కానిస్టేబుల్ రేప్.. దాడిలో వృద్ధురాలి మృతి! - up news

UP POLICE RAPE: ఉత్తర్​ప్రదేశ్​లో పోలీస్ కానిస్టేబుల్ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బైక్​పై ఎక్కించుకొని పక్క ఊరికి తీసుకెళ్లి రేప్ చేశాడు. మరోవైపు, పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించడం వల్ల ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.

UP POLICE RAPE
UP POLICE RAPE
author img

By

Published : May 8, 2022, 8:07 PM IST

UP POLICE RAPE: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. నేరాలను అరికట్టాల్సినవారే దారుణాలకు తెగబడుతున్నారు. యూపీలో ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. అలీగఢ్​కు చెందిన ఓ కానిస్టేబుల్.. ఆదివారం 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కాస్​గంజ్​కు చెందిన బాలిక అలీగఢ్​ అత్రౌలీలోని తన బంధువుల ఇంటికి రాగా.... వీరి కుటుంబానికి బంధువు అయిన కానిస్టేబుల్.. అప్పుడే వారి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం బాలికను తన బైక్​పై ఎక్కించుకొని పక్క ఊరికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పరారయ్యాడు.

అయితే, అక్కడి నుంచి బంధువుల ఇంటికి చేరుకున్న బాలిక.. జరిగిందంతా ఇంట్లో వారికి చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించి.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై అలీగఢ్ ఎస్పీ కఠిన చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో.. కానిస్టేబుల్​ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితుడిపై పోక్సో, ఐపీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

UP woman dead police: మరోవైపు, యూపీలోని ఫిరోజాబాద్​లో ఓ వృద్ధురాలిపై కొందరు పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 60 ఏళ్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలిని రాధా దేవిగా గుర్తించారు. పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించడం వల్లే రాధా దేవి మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భార్య మరణంపై కలత చెందిన దేవి భర్త ఫౌరాన్ సింగ్​ సింగ్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు.

ఈ దంపతుల నలుగురు కుమారులు శనివారమే జైలు నుంచి విడుదలయ్యారు. పుచ్​ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న వీరి ఇంటిని తనిఖీ చేసేందుకు పోలీసులు వెళ్లారని నగర ఎస్పీ ముకేశ్ చంద్ర వెల్లడించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు.

Maharashtra rape news: మరోవైపు, మహారాష్ట్రలోని బైకుల్లాలో 70 ఏళ్ల వృద్ధుడు పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన బాలిక తల్లి ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అగ్రిపాడా పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు, నిందితుడు బైకుల్లా ప్రాంతంలో నివసిస్తున్నారు. బిస్కెట్లు ఆశ చూపి బాలికపై రెండు నెలల క్రితం అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నం.. అంతలోనే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.