ETV Bharat / bharat

'నా భార్య అలిగింది.. ఫోన్​ చేసినా మాట్లాడడం లేదు.. లీవ్ కావాలి'.. ASPకి కానిస్టేబుల్​ లేఖ - ఉత్తర్​ప్రదేశ్​ లేటెస్ట్​ వైరల్ న్యూస్​

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ కానిస్టేబుల్​ ఏఎస్పీకి రాసిన లీవ్​ లెటర్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెల రోజుల క్రితం వివాహమైన ఆ కానిస్టేబుల్ ఇంటికి రాకపోవడం వల్ల అతని భార్య అలిగింది. దీంతో పాటు అతను చేసిన ఫోన్​కాల్స్​కు కూడా స్పందించడం లేదని.. తన బాధను వ్యక్తపరుస్తూ డిపార్ట్​మెంట్​కు లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లెటర్​ స్థానికంగా వైరల్​గా మారింది.

up Police Constable Leave Letter
ఏఎస్పీకి లీవ్​ లెటర్ రాసిన కానిస్టేబుల్​
author img

By

Published : Jan 9, 2023, 4:07 PM IST

అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు తనకు లీవ్​ కావాలని ఓ కానిస్టేబుల్ ఏఎస్పీని కోరాడు​. "పెళ్లై నెల రోజులు అవ్వకముందే భార్యను వదిలి వచ్చినందుకు ఆమె నాపై అలిగింది. నేను ఫోన్​ చేసినా స్పందించడం లేదు. అందుకు నాకు సెలవులు కావాలి" అని ఉన్నతాధికారికి లేఖ రాశాడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఆ కానిస్టేబుల్​.

2016 బ్యాచ్​కు చెందిన గౌరవ్​ చౌదరి అనే కానిస్టేబుల్ మౌ జిల్లా నివాసి. ప్రస్తుతం మహారాజ్​గంజ్​ జిల్లాలోని నౌత్వానా పోలీస్​స్టేషన్​ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. గౌరవ్​కు గతేడాది డిసెంబర్​లో వివాహం జరిగింది. అనంతరం తన భార్యను ఇంటి వద్ద వదిలి విధులకు హాజరయ్యాడు. అయితే వెళ్తూ వెళ్తూ.. మేనల్లుడి పుట్టినరోజున వారం రోజులు సెలవు తీసుకుని వస్తానని భార్యకు హామీ ఇచ్చాడు. కానీ దానికి ముందుగానే అతడి భార్య తన ఫోన్​కాల్స్​కు స్పందించడం మానేసి తన చిరుకోపాన్ని చూపుతోంది.

up Police Constable Leave Letter
కానిస్టేబుల్​ రాసిన లీవ్ లెటర్​

తన బాధను వ్యక్తం చేస్తూ.. 7 రోజులు సెలవులు కోరుతూ డిపార్ట్​మెంట్​కు లేఖ రాశాడు గౌరవ్. అందులో.. "పెళ్లి అయిన తర్వాత ఇంటికి వెళ్లలేదు. అందుకు నా భార్య పదే పదే నా ఫోన్‌ కాల్​ను కట్​ చేస్తోంది. కొన్నిసార్లు ఆమె ఫోన్ రిసీవ్​ చేసినా సరే.. మాట్లాడమని ఆమె తల్లికి ఇస్తోంది. అందుకే నాకు సెలవులు కావాలి" అని పేర్కొన్నాడు. అయితే కానిస్టేబుల్​ బాధను అర్థం చేసుకొన్న ఏఎస్పీ అతీశ్ కుమార్ సింగ్.. 5రోజులు సెలవులు మంజూరు చేశారు. గౌరవ్​ సెలవులు జనవరి 10న ప్రారంభం కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.