ఉత్తర్ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్కడి నేతలు వినూత్న ఎత్తుగడలు వేస్తున్నారు. హసన్గంజ్లో ఓటర్లకు పంచేందుకు ఓ అభ్యర్థి.. 2 క్వింటాళ్ల జిలేబీలు, 1,050 సమోసాలను సిద్ధం చేయగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో 10 మందిని అరెస్టు చేశారు.
మందస్తు సమాచారంతో హసన్గంజ్లోని సదరు అభ్యర్థి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఎల్పీజీ సిలిండర్లు, పిండి, నెయ్యి సహా జిలేబీలు, సమోసాలు, వాటిని తయారు చేయడానికి సిద్ధం చేసిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తర్ప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు.. ఏప్రిల్ 15 నుంచి నాలుగు విడతల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 29న తుది దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: విమానం టాయిలెట్లో 1.36 కిలోల బంగారం