ETV Bharat / bharat

బాలికతో మత మార్పిడి- యువకుడి అరెస్ట్​

​బాలికను అపహరించి బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం చేసుకున్నయువకుడిని గోరఖ్​పుర్​ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల తీసుకువచ్చిన 'చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం-2020' కింద కేసు నమోదు చేశారు.

UP man held for abducting, marrying minor after conversion
మైనర్​ బాలిక మత మార్పిడి- యువకుడి అరెస్టు
author img

By

Published : Mar 11, 2021, 3:04 PM IST

14ఏళ్ల బాలికను అపహరించి బలవంతంగా మత మర్పిడి చేసి వివాహం చేసుకున్న యువకుడిని ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పుర్​ పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఇటీవల తీసుకువచ్చిన మతమార్పిడి వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేశారు.

బిహార్​ నుంచి వలస వచ్చి షాపూర్​లో నివసిస్తున్న తబారక్​ ఖాన్​(23) అనే యువకుడు.. ఆరో తరగతి చదువుతున్న తన కూతురుని హింసిస్తున్నాడని బాలిక తల్లి ఆరోపించింది. మూడు రోజుల క్రితం కూతురు స్కూల్​ బ్యాగ్​లో 'నిఖానామా' (పెళ్లి పత్రం) అనే పత్రాన్ని కనుగొన్నట్లు వెల్లడించింది. కూతురుని ప్రశ్నించగా.. మార్చి 1న తబారక్​ అపహరించి వివాహం చేసుకుని.. ఇంటి వద్ద వదిలివెళ్లాడని కూతురు వెల్లడించినట్లు పోలీసులకు తల్లి తెలిపింది. నిఖా నామాను పోలీసు స్టేషన్​కు తీసుకువచ్చింది.

బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అపహరణ, యూపీ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం-2020 కింద కేసులు నమోదు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి ఎస్​కే సింగ్​ తెలిపారు. బాలిక వైద్య రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. బాలిక వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత మరిన్ని కేసులు జతచేసే అవకాశాలున్నాయని అన్నారు. నిఖా నామాలో బాలిక పేరు మార్చినట్లు పేర్కొన్నారు. వివాహం జరిపించడానికి తబారక్​కు సహకరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.