ETV Bharat / bharat

పెళ్లయ్యాక భార్య.. మహిళ కాదని తెలిస్తే.. - ఉత్తర్​ప్రదేశ్ న్యూస్

పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఆనందించాలని ఆశించిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. తాను పరిణయమాడింది మహిళను కాదని తెలిసింది. ఈ అనూహ్య ఘటన ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో జరిగింది. అసలేం జరిగిందంటే..

marriage, UP
పెళ్లి, మోసం, ట్రాన్స్​జెండర్
author img

By

Published : Jun 22, 2021, 4:36 PM IST

పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్నది మహిళను కాదని తెలిసింది. దీంతో.. మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యక్తి.

ఇదీ జరిగింది...

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​కు చెందిన ఓ వ్యక్తికి పంకి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ఏప్రిల్ 28న వివాహం జరిగింది. అయితే.. పెళ్లై చాలా రోజులైనప్పటికీ ఇరువురి మధ్య దాంపత్య జీవితం సాఫీగా సాగడం లేదు. అనారోగ్య సమస్యలున్నాయని చెప్పి భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు అయిష్టత చూపింది ఆ మహిళ. కొన్ని రోజుల తర్వాత.. భార్య ప్రవర్తనపై ఆ వ్యక్తికి అనుమానం కలిగింది.

వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. వైద్యులు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆమె మహిళ కాదని.. ట్రాన్స్​జెండర్ అని తెలిసింది. అంతే.. మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యక్తి. మెడికల్​ రిపోర్టు చూపించి.. తన వివాహానికి కారణమైనవారిపై కేసు నమోదు చేశాడు.

సెక్షన్ 420 కింద 8 మందిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:పోలీస్​ కానిస్టేబుళ్లుగా 15 మంది ట్రాన్స్​జెండర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.