Sex Change for Marriage: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి లింగ మార్పిడి చేయించుకుంటోంది. తోటి క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డ ఆమె.. లింగ మార్పిడితో అబ్బాయిలా మారేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగింది. నగరంలోని స్వరూప్‌రాణి నెహ్రూ ఆస్పత్రిలో నాలుగు నెలల క్రితమే యువతికి లింగ మార్పిడి చికిత్స ప్రారంభమైంది. అప్పుడు శరీర పైభాగంలోని అవయవాలకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు.. తాజాగా యువతి గర్భాశయాన్ని తొలగించారు. మరికొద్ది నెలల్లో చివరి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు. ఆ సర్జరీతో యువతి జననాంగాలు మారిపోతాయని స్పష్టం చేశారు.
UP girl gender change: కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. లింగ మార్పిడి చేయించుకున్న యువతి బీఏ చదువుతోంది. ఫంఫామవూలో నివసిస్తోంది. బీఏలో తన తోటి స్నేహితురాలితో యువతి ప్రేమలో పడింది. ఈ ప్రేమ.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థాయికి చేరింది. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇరుకుటుంబాలు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు.
ఫంఫామవూ యువతి.. వెంటనే స్వరూప్‌రాణి ఆస్పత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యుడు డాక్టర్ మోహిత్ జైన్‌ను సంప్రదించింది. లింగ మార్పిడి చేయించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తొలుత వైద్యులు కౌన్సిలింగ్ కోసం ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరకు పంపించారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లు నిరూపించుకున్న యువతి.. లింగ మార్పిడిపై వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో, యువతి లింగపరమైన సమస్యలతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. అందుకే ఆమె ఈ విషయంలో అసంతృప్తితో ఉందని తేల్చారు. ఆమె నుంచి అఫిడవిట్‌ను తీసుకొని సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నారు.
గడ్డం, మీసాలు కూడా...
శస్త్రచికిత్సలన్నీ పూర్తైన తర్వాత యువతి భౌతికంగా, మానసికంగా పూర్తిగా మారిపోతుందని వైద్యుడు మోహిత్ జైన్ తెలిపారు. ప్రవర్తనలోనూ మార్పు ఉంటుందని చెప్పారు. టెస్టోస్టిరాన్ హార్మోన్ థెరపీ నిర్వహించిన తర్వాత యువతికి గడ్డం, మీసాలు సైతం వస్తాయని వెల్లడించారు.
ఇదీ చదవండి: