ETV Bharat / bharat

'అలా ఎందుకు తీసుకొచ్చారు?' అతీక్ హత్యపై యోగి సర్కార్​కు సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు

అతీక్ అహ్మద్ హత్య కేసులో తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు అతీక్ కుమారుడి ఎన్​కౌంటర్​పైనా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

up-encounters-sc-case
up-encounters-sc-case
author img

By

Published : Apr 28, 2023, 1:16 PM IST

Updated : Apr 28, 2023, 2:16 PM IST

రాజకీయ నేత, మాజీ గ్యాంగ్​స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్​ను మీడియా ముందుకు ఎందుకు తీసుకొచ్చారని సుప్రీంకోర్టు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రయాగ్​రాజ్​లో ఏప్రిల్​ 15న జరిగిన హత్యలకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ సర్కార్​కు కీలక ప్రశ్నలు వేసింది సర్వోన్నత న్యాయస్థానం. అతీక్ సోదరుల హత్యల కేసులో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన బెంచ్ శుక్రవారం స్పష్టం చేసింది. అతీక్ హత్యకు ముందు పోలీసుల ఎన్​కౌంటర్​లో అతడి కుమారుడు అసద్ మరణించిన ఘటనపైనా నివేదిక ఇవ్వాలని యోగి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

ఉత్తర్​ప్రదేశ్​లో జరుగుతున్న వరుస ఎన్​కౌంటర్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. 2017 నుంచి రాష్ట్రంలో 183 ఎన్​కౌంటర్లు జరిగాయని, వాటిపై దర్యాప్తు చేయాలని కోరుతూ అడ్వొకేట్ విశాల్ తివారి పిటిషన్ దాఖలు చేశారు. 2020లో జరిగిన వికాస్ దుబె ఎన్​కౌంటర్​లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ.. యోగి సర్కారుకు క్లీన్ చిట్ ఇవ్వడంపైనా పిటిషనర్ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ చౌహాన్ నివేదిక అనంతరం.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని యోగి సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది.

"అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్​ను పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు హంతకులకు ఎలా తెలిసింది? ఆస్పత్రి ఎంట్రీ గేటు వరకు అతీక్, అష్రఫ్​ను పోలీసులు ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు? అంబులెన్సులోనే నేరుగా తీసుకెళ్లాల్సింది కదా? మీ వద్ద ఏ మెటీరియల్ ఉన్నా.. మాకు సమర్పించండి."
-సుప్రీంకోర్టు

అయితే, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయొద్దని ఉత్తర్​ప్రదేశ్ సర్కారు తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ సోదరుల హత్యలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని సుప్రీంకోర్టుకు విన్నవించారు. దూరం పెద్దగా లేనందువల్లే ఆస్పత్రి గేటు వరకు అతీక్, అష్రఫ్​ను నడిపించుకుంటూ తీసుకెళ్లినట్లు వివరించారు. 'ఈ వ్యక్తి(అతీక్), అతడి కుటుంబం 30 ఏళ్లుగా అనేక దారుణ నేరాలకు పాల్పడింది. వారిపై కోపంతోనే అహ్మద్ సోదరుల హత్య జరిగి ఉంటుంది. ఈ కోణంలో విచారణ జరుపుతున్నాం. నిందితులు ఫొటోగ్రాఫర్లలా వచ్చారు. కెమెరాలు, ఐడీ కార్డులు కూడా ఉన్నాయి. ఆ ఐడీ కార్డులు ఫేక్ అని తేలాయి. ఆస్పత్రి బయట చాలా మంది ఉన్నారు. అప్పుడే హత్య జరిగింది' అని రోహత్గి వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల తర్వాత ఈ కేసును విచారించనున్నట్లు స్పష్టం చేసింది.

అతీక్ కుమారుడు అసద్ ఏప్రిల్ 13న ఝాన్సీలో జరిగిన పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. స్పెషల్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అసద్​ను కాల్చి చంపారు. రెండ్రోజుల తర్వాత అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్​ హత్యకు గురయ్యారు. మీడియా ప్రతినిధులుగా వచ్చిన ముగ్గురు యువకులు.. అతీక్​కు పాయింట్ బ్లాంక్​లో గన్ పెట్టి కాల్చారు. అష్రఫ్ పైనా కాల్పులు జరిపారు. దీంతో ఇరువురూ ఘటనాస్థలిలోనే కుప్పకూలి చనిపోయారు. ప్రయాగ్​రాజ్​లో ఈ ఘటన జరిగింది. నగరంలోని వైద్య కళాశాలలో మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరగడం వివాదాస్పదమైంది.

Last Updated : Apr 28, 2023, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.