UP Elections 2022: ఐదేళ్ల క్రితం ఉత్తర్ప్రదేశ్లో అల్లరి మూకలు, గూండాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారని సమాజ్వాదీ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత యూపీలో మొదటి వర్చువల్ ర్యాలీలో దిల్లీ నుంచి పాల్గొన్నారు.
"ఐదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో గూండాలదే రాజ్యం. వారు చెప్పిందే చట్టంగా మారింది. రాష్ట్రంలో లూఠీలు సర్వసాధారణంగా ఉండేవి. బాలికలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడేవారు."
-ప్రధాని నరేంద్ర మోదీ
గత ప్రభుత్వ హయాంలో పశ్చిమ యూపీ అల్లర్లతో రగిలిపోయిందని అన్నారు మోదీ. ఆ అల్లర్లను చూసి కొందరు వేడుక చేసుకున్నారని దుయ్యబట్టారు. యోగి హయాంలో గూండాలకు చట్టం అంటే ఏంటో తెలిసివచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించామని ప్రధాని అన్నారు. వలసలను తగ్గించామని పేర్కొన్నారు. పగ తీర్చుకోవడానికైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థులపై మండిపడ్డారు మోదీ.
ఇదీ చదవండి: గోవాలో కుల రాజకీయాలు.. ఎవరి వ్యూహం ఫలించేనో..?