ETV Bharat / bharat

అయోధ్యలో ప్రపంచస్థాయి బస్ స్టేషన్ - అయోధ్య బస్​స్టేషన్​ వార్త

అయోధ్యలో ప్రపంచ స్థాయి బస్​స్టేషన్​ నిర్మాణానికి ఉత్తర్​ప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.400 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. అలాగే అయోధ్య-సుల్తానాపుర్ మధ్య నాలుగు లైన్ల ఫ్లైఓవర్​ నిర్మాణానికి కూడా మంత్రివర్గం ప్రతిపాదించింది.

world-class bus station in Ayodhya
అయోధ్యలో ప్రపంచస్థాయి బస్ స్టేషన్​
author img

By

Published : Jun 14, 2021, 9:35 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కేబినెట్​ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో ప్రపంచ స్థాయి బస్​స్టేషన్​ నిర్మాణానికి సోమవారం ఆమోదం తెలిపింది. రూ.400 వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేషన్​లో భక్తుల సౌకర్యార్థం అత్యవసర సేవలు సైతం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి సిద్ధార్థనాథ్​ సింగ్​ తెలిపారు.

"అయోధ్యలో నిర్మించనున్న రామాలయాన్ని దర్శించడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు రానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి బస్​స్టేషన్​ నిర్మించడానికి కేబినెట్​ ఆమోదించింది. ఇందుకు అవసరమైన తొమ్మిది ఎకరాల భూమిని సాంస్కృతిక విభాగం.. రవాణా శాఖకు ఇవ్వనుంది. రూ.400 కోట్ల ఖర్చుతో దీనిని​ నిర్మించనున్నారు."

- సిద్ధార్థనాథ్​ సింగ్​, రాష్ట్ర కేబినెట్ మంత్రి

అయోధ్య నుంచి అన్ని ప్రధాన నగరాలకు బస్సులు నడపనున్నట్లు సింగ్​ తెలిపారు. అలాగే అయోధ్య-సుల్తాన్‌పుర్​ రహదారిపై నాలుగు లైన్ల ఫ్లైఓవర్​ నిర్మాణ ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. రూ.20 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల ప్లైఓవర్​ను నిర్మించనున్నారు.

ఇదీ చూడండి: అయోధ్య ఆలయ భూమిపై వివాదం- అవినీతి నిజమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.