ETV Bharat / bharat

యూపీ ఆరో విడత ఎన్నికలు- ఒంటి గంట వరకు 36% పోలింగ్

UP Assembly Elections 2022
UP Assembly Elections 2022
author img

By

Published : Mar 3, 2022, 6:48 AM IST

Updated : Mar 3, 2022, 1:43 PM IST

13:42 March 03

యూపీలో ఆరో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.33శాతం ఓటింగ్ నమోదైంది.

11:50 March 03

యూపీలో ఉదయం 11 గంటల వరకు 21.79శాతం పోలింగ్ నమోదైంది.

09:53 March 03

యూపీలో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.44శాతం ఓట్లు పోలయ్యాయి.

08:27 March 03

ఓటేసిన మంత్రి ఆనంద్​ స్వరూప్​ శుక్లా..

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో బలియా నుంచి బరిలో ఉన్న మంత్రి ఆనంద్​ స్వరూప్​ శుక్లా.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 350 సీట్లకుపైగా భాజపానే సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

07:07 March 03

ఓటేసిన యోగి ఆదిత్యనాథ్​..

ఆరో విడత పోలింగ్​లో భాగంగా.. ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్​పుర్​లోని గోరఖ్​నాథ్ కన్యానగర్​ క్షేత్రలోని ప్రైమరీ స్కూల్​లో ఓటేశారు.

సీఎం ఈ దశలోనే గోరఖ్​పుర్​ నుంచి బరిలో ఉన్నారు. మార్చి 10న ఆయన భవితవ్యం తేలనుంది.

06:59 March 03

పోలింగ్​ షురూ..

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు.. పోలింగ్​ కేంద్రాల ముందు బారులు తీరారు. మొత్తం 57 స్థానాలకు ఓటింగ్​ జరుగుతోంది. 626 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

మార్చి 7న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.

06:24 March 03

ఆరో విడత పోలింగ్​కు యూపీ సిద్ధం.. బరిలో 676 మంది

UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఆరో విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. గోరఖ్​పుర్ సహా 10 జిల్లాల పరిధిలోని 57 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 57 స్థానాల్లో 676 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

కీలక నేతలు

  • యోగి ఆదిత్యనాథ్- యూపీ ముఖ్యమంత్రి-- గోరఖ్​పుర్ అర్బన్
  • కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ-- తమ్కుహీ రాజ్
  • మాజీ మంత్రి, ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య-- ఫాజిల్​నగర్
  • అసెంబ్లీలో విపక్ష నేత రామ్ గోవింద్ చౌదరి-- బాంసిడీ

వీరితో పాటు రాష్ట్ర మంత్రుల్లో పలువురు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మంత్రులు సూర్యప్రతాప్ షాహీ, సతీశ్ చంద్ర ద్వివేది, జైప్రతాప్ సింగ్, శ్రీరాం చౌహాన్, జైప్రకాశ్ నిషాద్ ఈ విడతలో బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్.. గోరఖ్​పుర్ అర్బన్ నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్​కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు.

Last Updated : Mar 3, 2022, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.