Kuldeep Singh Sengar: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె న్యాయవాదిపై యాక్సిడెంట్ కేసులో ఉన్నావ్ అత్యాచార కేసు దోషి, భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌ను దిల్లీలోని ది రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే ఆదేశాలు జారీ చేశారు.
అసలేంటీ కేసు..?
2019 జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సెంగార్తో పాటు మరో 12 మంది ఈ ఘటనలో నిందితులుగా తేలారు. విచారణ సమయంలో సీబీఐ.. సెంగారే ఈ నేరానికి పాల్పడ్డానికి తమకు ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో సెంగార్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన... ఉన్నావ్ అత్యాచార కేసులో 2019 డిసెంబరు 20న కుల్దీప్ సెంగార్‌కు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అంతేగాకుండా... రూ.25 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అందులో రూ.10 లక్షలను బాధితురాలి కుటుంబానికి అందించాలని పేర్కొంది. అయితే.. ఈ తీర్పును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టును సెంగార్ ఆశ్రయించారు.
ఇదీ చూడండి: 'భాజపాకు త్వరలోనే చెడ్డ రోజులు.. ఇదే నా శాపం'