ETV Bharat / bharat

గంగానదిలో మరోసారి మృతదేహాల కలకలం

ఉత్తర్​ ప్రదేశ్​లోని గంగానదిలో మరోసారి మృతదేహాలు కొట్టుకురావటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతున్న క్రమంలో ఒడ్డున పూడ్చిపెట్టిన శవాలు నీళ్లలోకి వచ్చినట్లు భావిస్తున్నారు.

ganga river dead bodies
మృతదేహాలు లభ్యం
author img

By

Published : May 31, 2021, 1:32 PM IST

గంగానదిలో తేలిన మృతదేహాలు

ఉత్తర్​ప్రదేశ్​లోని గంగానదిలో మరోసారి శవాలు తేలియాడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఉన్నావ్​ జిల్లాలోని గంగా నదిలో ఆదివారం మృతదేహాలు కొట్టుకురాగా స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఉన్నావ్​లో జరగలేదు..

నీటి ఉద్ధృతి పెరగటం వల్ల నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టిన కొవిడ్​ మృతదేహాలు నీటిలోకి కొట్టుకొచ్చాయని స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఉన్నావ్ జిల్లా అధికారులు తెలిపారు. తాము నదీపరివాహక ప్రాంతంలో గస్తీ నిర్వహించామని.. నదిలో శవాలు కనిపించలేదన్నారు.

Bodies found floating in River Ganga
గంగానదిలో శవాల కలకలం
Bodies found floating in River Ganga
నదిలో కొట్టుకొస్తున్న శవాలు
Bodies found floating in River Ganga
గంగానదిలో తేలుతున్న మృతదేహాలు

బిహార్, ఉత్తర్​ప్రదేశ్​లోని నదీపరివాహక ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు లభ్యం కావటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నాయి.

ఇదీ చదవండి : సరయూ నదిలో కొవిడ్ మృతదేహాలు!

ఫతేపుర్​లో ఆరు మృతదేహాలు..

ఉత్తర్​ప్రదేశ్​ ఫతేపుర్​లోని గంగానదిలో ఆరు మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నది వద్దకు చేరుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆరు మృతదేహాలను బయటకు తీసినట్లు ఫతేపుర్ కలెక్టర్ ప్రమోద్​ ఝా తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయన్నారు.

అంతకుముందు.. నరహీ ప్రాంతంలోని ఉజియార్, కుల్హదియా, భరౌలీ ఘాట్​లలో దాదాపు 52 మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇదీ చదవండి : గంగానదిలో తేలిన 50మృతదేహాలు.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.