ETV Bharat / bharat

'ఫోన్​ నంబర్​ ఇవ్వలేదని హత్య చేశాను' - బాబుహరా గ్రామం

ఉత్తర్​ప్రదేశ్​లోని ఉన్నావ్​ జిల్లాలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ఇద్దరు బాలికల కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో అస్వస్థత పాలైన మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. ఆ ముగ్గురి బాలికల్లో ఒకరిని తాను ప్రేమించానని, అయితే ఆమె అందుకు ఒప్పుకోకపోవడం వల్ల హత్య చేసినట్టు నిందితుడు లంబు అంగీకరించాడని వెల్లడించారు.

unnao-case
ప్రేమను అంగీకరించకే బాలికల హత్య
author img

By

Published : Feb 20, 2021, 12:19 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా బాబుహరా గ్రామంలో ఇద్దరు బాలికలు మరణించిన వ్యవహారంలో ఇద్దర్ని అరెస్టు చేసినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. వినయ్‌ కుమార్‌ అలియాస్‌ లంబు, మరో టీనేజీ బాలుడ్ని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ సంఘటనలో అస్వస్థత పాలైన మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు. ఆ ముగ్గురి బాలికల్లో ఒకరిని తాను ప్రేమించానని, అయితే ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్టు లంబు అంగీకరించాడని వివరించారు. అతడు ఇచ్చిన వాంగ్మూలంలో..

"నాకు కొద్దిగా పొలం ఉంది. గడ్డి కోసం ఆ బాలికలు అక్కడికి వస్తుంటారు. లాక్‌డౌన్‌ సమయంలో మేం స్నేహితులమయ్యాం. కలిసి తిన్నాం. ఆడుకున్నాం. ఒకామెతో నాది వన్‌ సైడ్‌ లవ్‌. నా ప్రేమను ఆమె తిరస్కరించింది. నెల రోజుల క్రితం ఫోన్‌ నెంబరు అడిగితే ఇవ్వలేదు. అందుకే కోపం వచ్చి చంపాలని అనుకున్నా. బుధవారం నాడు వారి తిండికి ఏమైనా తీసుకురావాలని స్నేహితునికి చెప్పాను. వారు అవి తిని నీరు అడిగారు. అప్పటికే సీసాలో పురుగుమందు కలిపిన నీటిని ఉంచాను. అది ఇచ్చాను. వారు దాన్ని తాగారు. పొలంలోనే వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాను" అని లంబు ఒప్పుకొన్నాడని లఖ్‌నవూ రేంజి ఐజీ లక్ష్మీ సింగ్‌ చెప్పారు. గట్టిబందోబస్తు నడుమ స్వగ్రామంలో ఆ బాలికల అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి: పొలంలో ఇద్దరు బాలికల అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.