Unique Railway Gate: బిహార్‌లోని సివాన్‌లో గేట్మ్యాన్లేని ఓ రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంది. ఆ ప్రాంతంలో ఏ రైలు వచ్చినా గేటు సమీపంలో ఆగాల్సిందే.. ఆ తర్వాత రైలు నుంచి లోకోపైలట్ దిగి గేటు మూసివేయాలి. అనంతరం కాసేపటికే గేటు తెరవాలి. తర్వాత రైలు ముందుకు పోనివ్వాలి. సివాన్-మష్రక్ రైలు మార్గంలో రగడ్గంజ్ లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది.
'ఏమైనా జరిగితే బాధ్యులెవరు?'.. అయితే కొన్నిసార్లు రైల్వే గేటు వేయకుండానే.. రైళ్లు వెళ్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అలాంటి సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరని అధికారులను ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
'ఏది జరిగినా నియమాల ప్రకారమే'.. అయితే ఈ విషయంపై వారణాసి రైల్వే అధికారి అశోక్‌కుమార్ స్పందించారు. దీన్ని 'ఒకే రైలు వ్యవస్థ' అంటారని, ఏది జరిగినా రైల్వే నియమాల ప్రకారమే జరుగుతుందని ఆయన చెప్పారు. నిబంధనలు ప్రకారమే లోకో పైలట్ దిగి గేటు వేసి మళ్లీ తెరుస్తున్నాడని చెప్పడం గమనార్హం. అయితే గోరఖ్‌పుర్ రైల్వే సీనియర్ ఇంజినీర్ ఉపేంద్ర సింగ్ మరో విధంగా స్పందించారు. ఆ ప్రాంతంలో లెవెల్ క్రాసింగ్ స్టేషన్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.
ఇవీ చదవండి: రెండు బైక్‌లను బలంగా ఢీకొట్టిన స్కార్పియా.. బంపర్‌లో బైకర్ ఇరుక్కుని..
పార్లర్లో యువతిపై గ్యాంగ్‌రేప్.. మేనేజర్, కస్టమర్ కలిసి..