ETV Bharat / bharat

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు జననం!

author img

By

Published : Jan 18, 2022, 4:54 PM IST

Unique Child Born: నాలుగు కాళ్లు, చేతులు ఉన్నట్లుగా కనిపించే శిశువుకు జన్మనిచ్చింది ఓ మహిళ. దీంతో ఆ శిశువును చూసేందుకు జనం భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సంఘటన బిహార్​లో జరిగింది.

Unique child born
Unique child born

Unique Child Born: బిహార్​ కటిహార్​ జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. ఓ మహిళ.. నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నట్లు కనిపిస్తున్న శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును చూసేందుకు మహిళ ప్రసవించిన ఆస్పత్రికి జనం భారీగా తరలి వెళ్తున్నారు.

కతిహార్‌లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫ్లగంజ్ గ్రామానికి చెందిన రాజు సాహ్​ తన భార్యను ప్రసవం కోసం సదర్​ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ఎంతో సంబరపడ్డారు. అయితే నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయని వైద్య సిబ్బంది చెప్పగా ఆవేదనకు గురయ్యారు. అప్పుడే పుట్టిన బిడ్డను చూసి అందరూ షాక్ అయ్యారు.

దీంతో ప్రైవేటు క్లినిక్​ వైద్యులపై బంధువులు ఆరోపణలు చేశారు. గతంలో స్కానింగ్​ తీసినప్పుడు దీని గురించి ఎలాంటి విషయాలు చెప్పలేదని ఆందోళన చెందారు. ఎప్పుడు అడిగినా శిశువు ఆరోగ్యం ఉన్నట్లు చెప్పేవారని.. చివరకు వింత శిశువు జన్మించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'వింత శిశువు కాదు'

ఇదేం వింత శిశువు కాదని.. దివ్యాంగులుగా పిలుస్తారని సదర్​ ఆస్పత్రి వైద్య సిబ్బంది చెప్పారు. గర్భధారణ సమయంలో కవలలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. ఆపరేషన్​ చేసి శిశువును బయటకు తీసిన వైద్యులు.. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కొండచిలువను మింగిన కోబ్రా- చివరకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.