ETV Bharat / bharat

'నన్ను ఆ పదవి నుంచి తప్పించడంపై బాధలేదు.. భాజపా కార్యకర్తగా గర్విస్తున్నా' - నితిన్ గడ్కరీ భాజపా

భాజపా పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పోయినందుకు తాను నిరాశ చెందలేదని, భవిష్యత్తులో కూడా నిరాశపడబోనని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

Nitin gadkari on board interview
Nitin gadkari on board interview
author img

By

Published : Nov 9, 2022, 11:08 AM IST

Updated : Nov 9, 2022, 11:57 AM IST

నితిన్ గడ్కరీ ఇంటర్వ్యూ

భాజపా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడంపై స్పందించారు కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. బోర్డులో స్థానం కోల్పోయినందుకు తాను నిరాశ చెందలేదని.. భవిష్యత్తులో కూడా నిరాశపడబోనని స్పష్టం చేశారు. తొలగింపుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రమే సమాధానం ఇవ్వగలరని అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండడమే తనకు గర్వకారణమని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల ప్రచారం సందర్భంగా నితిన్​ గడ్కరీ ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

డబుల్​ ఇంజిన్ సర్కారు చేసిన అభివృద్ధి పనులతో హిమాచల్​ ప్రదేశ్​, గుజరాత్​ ప్రజల మన్ననలు పొందామని చెప్పారు నితిన్ గడ్కరీ. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారం చేపట్టాక.. డబుల్ ఇంజిన్​ సర్కారుతో హిమాచల్ ప్రదేశ్​లో అద్భుతమైన ప్రగతిని సాధించామని పేర్కొన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో మూడు జాతీయ రహదారులు మాత్రమే ఉండేవని.. తాము వచ్చాక ఆ సంఖ్య 66కు చేరుకుందని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధి తమ ధ్యేయమని చెప్పారు.

భాజపా కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ అని.. అధ్యక్షుడికి ప్రతి ఎన్నిక ముఖ్యమైనదేనని అన్నారు నితిన్ గడ్కరీ. ఆమ్​ ఆద్మీ పార్టీ.. గుజరాత్, హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన స్పందించారు. "దేశ రాజకీయాలను పరిశీలిస్తే రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. ఎన్నికలు అనగానే కొన్ని పార్టీలు పోటీలోకి వచ్చి ఆసక్తిని రేకేత్తిస్తాయి. వాటి సంగతి ఫలితాల తర్వాత మనకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయవచ్చు." అని అన్నారు.

ప్రజలు వివేకవంతులు..
ఉచితాల విషయానికొస్తే రాజకీయ నేతల కన్నా ప్రజలే తెలివైన వారని తాను నమ్ముతానని వ్యాఖ్యానించారు గడ్కరీ. ఎన్ని ఉచితాలు ఇచ్చినా.. వాటితో ప్రభావితం కాకుండా ప్రజలు విచక్షణతో ఓటు వేస్తారని చెప్పారు. గుజరాత్​లో ఇటీవలే జరిగిన మోర్బీ దుర్ఘటనపై ప్రశ్నించగా.. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. వంతెన పరిస్థితిని నిత్యం గమనిస్తూ ప్రమాదం తలెత్తకుండా అప్రమత్తం చేస్తుందని తెలిపారు. ఈ పరికరాన్ని త్వరలోనే అన్ని రాష్ట్రాలకు అందిస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి: గుజరాత్​లో కాంగ్రెస్​కు షాక్​.. 10 సార్లు గెలిచిన ఎమ్మెల్యే భాజపా గూటికి

పుట్టినరోజున అడ్వాణీకి శుభాకాంక్షల వెల్లువ.. స్వయంగా ఇంటికి వెళ్లిన మోదీ

Last Updated : Nov 9, 2022, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.