ETV Bharat / bharat

ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం చేయాలనుకోవట్లేదు: కేంద్రమంత్రి ఫగ్గన్‌

Union Minister
Union Minister
author img

By

Published : Apr 13, 2023, 12:04 PM IST

Updated : Apr 13, 2023, 12:45 PM IST

12:01 April 13

విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్‌గార్ మేళా

Union Minister Comments On Visakha Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ మంత్రుల విమర్శలు.. తెలంగాణ మినిస్టర్ల కౌంటర్లతో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ఇటీవల వెలువరించిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన టెండర్‌లో పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కేసీఆర్‌ సూచన మేరకు సింగరేణి అధికారులు విశాఖ ప్లాంట్​ను సందర్శించారు. సింగరేణి ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ పరిశ్రమకు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అలాగే సింగరేణి సీఎండీతో సమావేశం అయ్యారు.

అయితే ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే గురువారం స్టీల్ ప్లాంట్​ను సందర్శించారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్‌గార్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో కేంద్ర ఉక్కు సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పాల్గొని.. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై మాట్లాడిన కేంద్ర మంత్రి.. ఇప్పటికిప్పుడు దానిని ప్రైవేట్‌పరం చేయాలని అనుకోవట్లేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామన్న మంత్రి.. స్టీల్‌ ప్లాంట్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధికారులతో భేటీ అవుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం వారి పరిధిలోని విషయమని కేంద్రమంత్రి ఫగ్గన్‌ తేల్చిచెప్పారు. ఇప్పటివరకూ ఈనెల 15వరకూ బిడ్డింగ్​ గడువు ఉండగా.. కేంద్రమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలతో ఉత్కంఠ నెలకొంది.

‘‘ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. స్టీల్‌ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. స్టీల్‌ ప్లాంట్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధికారులతో భేటీ అవుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనడం వారి పరిధిలోని విషయం’’-ఫగ్గన్ సింగ్‌ కులస్తే, కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Apr 13, 2023, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.