బంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర హోం శాఖ. ఈ ఘర్షణల్లో ముగ్గురు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు భాజపా చెందిన వారు కాగా మరో వ్యక్తి ఐఎస్ఎఫ్ కార్యకర్త.
'తృణమూల్ పనే'
బంగాల్లో ఘర్షణలు చెలరేగటానికి మమతా బెనర్జీ కారణం అంటూ.. భాజపా విమర్శనాస్త్రాలు సంధించింది. తమ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది.
" రాష్ట్ర ప్రజలను కాపాడటం మీ (మమతా బెనర్జీ) ప్రధాన కర్తవ్యం. 18 ఎంపీలు, 77 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేము.. ఇలాంటి హింసపై పోరాడతాం."
-- బీఎల్ సంతోష్ , భాజపా జనరల్ సెక్రటరీ
ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను సైతం భాజపా నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మరోవైపు ఇలాంటి ఘర్షణలపై కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మౌనంగా వ్యవహరించాలని మమతా బెనర్జీ సూచించారు.
ఇదీ చదవండి : ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు- దెబ్బతిన్న ఇళ్లు