ETV Bharat / bharat

ఉక్రెయిన్​లోని ఎంబసీ కుటుంబాలకు కేంద్రం అలర్ట్!​ - Indians to leave Ukraine

Indian Embassy officials to leave Ukraine: ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబాలకు కేంద్రం కీలక సూచన చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్​-రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో స్వదేశానికి తిరిగిరావాలని పిలుపునిచ్చినట్లు పేర్కొన్నాయి.

Ukraine crisis updates
Ukraine crisis updates
author img

By

Published : Feb 20, 2022, 10:34 PM IST

Indian Embassy officials to leave Ukraine: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబసభ్యులకు కేంద్రం కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చని తక్షణమే కుటుంబ సభ్యులతో పాటు ఉక్రెయిన్​ వదిలి స్వదేశానికి తిరిగిరావాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్​ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో దేశాలు, రష్యా మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అత్యవసరం లేనివారు, విద్యార్థులు ఉక్రెయిన్ వీడాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అందుకు అనుగుణంగా కమర్షియల్​, ఛార్టర్​ విమానాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఎంబసీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వెబ్‌సైట్‌ చూడాలని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎంబసీ సిబ్బంది కుటుంబసభ్యులు కూడా స్వదేశానికి రావాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది.

మరోవైపు తూర్పు ఉక్రెయిన్​లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్​ సైన్యం, రష్యా వేర్పాటువాదుల పరస్పర దాడులు తారస్థాయికి చేరాయి. కాగా సరిహద్దుల్లో రష్యా అణుపాటవాన్ని ప్రదర్శిస్తోంది. అక్కడి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఎప్పుడేం చేస్తోందన్న భయాలు ఆదివారం మరింత తీవ్రమయ్యాయి.

ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఆత్మహత్యా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.