ETV Bharat / bharat

నలుగురు స్నేహితులను బలిగొన్న వేట సరదా! - వేటలో అపశ్రుతి

వేటకు వెళ్లిన క్రమంలో తుపాకీ మిస్​ఫైర్​ అయి ఓ యువకుడు మరణించగా.. ఆ బృందంలోని మరో ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుర్ఘటన ఉత్తరాఖండ్​ తెహ్రీ జిల్లాలో జరిగింది.

Youth dies from bullet injury
వేటకు వెళ్లి నలుగురు యువకులు మృతి
author img

By

Published : Apr 5, 2021, 3:21 AM IST

Updated : Apr 5, 2021, 4:58 AM IST

స్నేహితుల వేట సరదా నలుగురి ప్రాణాలను బలిగొంది. అడవిలో వేటకు వెళ్తున్న క్రమంలో తుపాకీ మిస్​ఫైర్​ అయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ముగ్గురు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్​ తెహ్రీ జిల్లాలోని కుందీ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగింది.

ఇదీ జరిగింది..

జిల్లాలోని భిలాంగన బ్లాక్​లోని ఓ గ్రామానికి చెందిన ఏడుగురు స్నేహితులు శనివారం రాత్రి అడవిలోకి వేటకు వెళ్లారు. రాజీవ్​(22) తూటాలు నింపిన తుపాకీతో ముందుండి తమ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాలుకి ఏదో తగిలి అదుపుతప్పి కిందపడిపోయాడు. తుపాకీ మిస్​ఫైర్​ అయి సంతోశ్​​ అనే యువకుడికి తూటా తగిలింది. రక్తం ఎక్కువగా పోవటం వల్ల సంతోశ్​ అక్కడే ప్రాణాలొదిలాడు. ఈ ఘటనతో స్నేహితులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలోనే రాజీవ్​ తుపాకీతో పరారయ్యాడు. మరో ముగ్గురు సోబన్​, పంకజ్​, అర్జున్​లు.. క్రిమిసంహారక రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

రాహుల్​, సుమిత్​లు సమీప గ్రామానికి వెళ్లి జరిగిన విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్థులు ఆత్మహత్య చేసుకున్న ముగ్గురిని బెలేశ్వర్​ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు తరలించారు. అక్కడికి వెళ్లేలోపే పంకజ్​, అర్జున్​లు మరణించారు. చికిత్స పొందుతూ సోబన్​ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

బాధితులంతా 18 నుంచి 22 ఏళ్ల లోపువారే కావటం గమనార్హం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు తెహ్రీ జిల్లా మెజిస్ట్రేట్​ ఐవా ఆశిశ్​ శ్రీవాస్తవా తెలిపారు. మృతదేహాలకు శవపరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: జవాన్లపై 400 మంది నక్సలైట్ల ముప్పేట దాడి!

Last Updated : Apr 5, 2021, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.