హరిద్వార్‌లో కుంభమేళాకు (Kumbh Mela) హాజరైన లక్ష మందికి పైగా భక్తులకు నకిలీ కొవిడ్ పరీక్షలు చేశారని వార్తలు వస్తున్న క్రమంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు హరిద్వార్ ఎస్పీ సెంథిల్ అవూధాయ్ కృష్ణరాజ్ ఎస్ నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణను వేగవంతం చేసేందుకే సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
అంతకుముందు.. నకిలీ కొవిడ్ పరీక్షలు నిర్వహించిన ల్యాబ్‌లపై కేసు నమోదు చేశారు పోలీసులు.
వివాదం ఏంటంటే?
కుంభమేళా(Kumbh Mela) నిర్వహించేందుకు సిద్ధమైన ఉత్తరాఖండ్ సర్కారు.. భక్తులకు కొవిడ్ టెస్టులు చేయాలని నిర్ణయించుకొని, ఇందుకోసం ప్రైవేటు ల్యాబ్‌లను నియమించుకుంది. అయితే, ఈ ల్యాబ్‌లు నకిలీ కరోనా ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయని మీడియా కథనాల ద్వారా బయటపడింది.
ఇదీ చదవండి : కుంభమేళాలో నకిలీ కరోనా రిపోర్టులు- 'అడ్రెస్' లేని ల్యాబ్