ETV Bharat / bharat

కాంవడ్​ యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్​ ప్రభుత్వం

author img

By

Published : Jul 14, 2021, 6:34 AM IST

కరోనా మూడో దశ, డెల్టా ప్లస్ వేరియంట్​ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్​ సర్కార్​ కాంవడ్​ యాత్రను రద్దు చేసింది. ఈ మేరకు అక్కడి ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్ థామి మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.

Kanwar Yatra, Kanwar Yatra cancelled
కన్వార్​ యాత్రను రద్దు

కరోనా మూడోదశను దృష్టిలో ఉంచుకొని కాంవడ్​ యాత్రను రద్దు చేసింది ఉత్తరాఖండ్​ ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మూడో వేవ్​, డెల్టా ప్లస్​ వేరియంట్లను పరిగణలోకి తీసుకుని యాత్రను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ థామి తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్​ దేశంలోని గాక విదేశాల్లోనూ మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, వైద్యారోగ్య నిపుణల అభిప్రాయాలను సేకరణ తరువాత, ఇతర అంశాలను పరిగణలోకి ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు థామి చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన సీఎం.. పక్క రాష్ట్రాల ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుని మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని డీజీపీ అశోక్​ కుమార్​ను ఆదేశించారు.

కరోనా కారణంగా ఉత్తరాఖండ్​లో కాంవడ్​ యాత్ర రద్దు కావడం ఇది రెండో సారి. కానీ పక్క రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​లో మాత్రం కరోనా ఆంక్షలను పాటిస్తూ జూలై 25 దాకా ఈ యాత్ర నిర్వహించేందుకు యోగి సర్కారు అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి: 'ఆమెకు విడాకులిస్తేనే నీకు ఎమ్మెల్యే పదవి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.