ETV Bharat / bharat

బ్రిటన్​ నుంచి భారత్​కు మరో 1000 వెంటిలేటర్లు - బ్రిటన్​ వెంటిలేటర్లు

కరోనా విజృంభణ వేళ బ్రిటన్​ నుంచి భారత్​కు మరో 1000 వెంటిలేటర్లు అందనున్నాయి. బోరిస్​-మోదీ మధ్య మంగళవారం జరగనున్న వర్చువల్​ భేటీకి ముందు బ్రిటన్​ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్​కు బ్రిటన్​ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొంది.

UK to send 1,000 more ventilators ahead of Modi-Johnson virtual talks on Tuesday
బ్రిటన్​ నుంచి భారత్​కు మరో 1000 వెంటిలేటర్లు
author img

By

Published : May 3, 2021, 7:10 AM IST

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​.. మంగళవారం వర్చువల్​గా భేటీకానున్నారు. ఈ విషయాన్ని డౌనింగ్​ స్ట్రీట్​ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసే విధంగా ఈ భేటీ జరగనుందని పేర్కొన్నాయి.

కొవిడ్​పై పోరు...

భారత్​లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో దేశానికి మరింత సహాయం చేసేందుకు బ్రిటన్​ చర్యలు చేపట్టింది. బ్రిటన్​ నుంచి 1000కిపైగా వెంటిలేటర్లను పంపించనున్నట్టు పేర్కొంది.

495 ఆక్సిజన్​ కాన్​సెంటేటర్లు, మూడు ఆక్సిజన్​ జెనరేటర్​ యూనిట్లను భారత్​కు అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది​.

"మంగళవారం.. భారత ప్రధాని మోదీతో బోరిస్​ వర్చువల్​గా సమావేశమవుతారు. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేసే దిశగా భారీస్థాయిలో ఒప్పందాలు ఉంటాయి. కరోనాపై పోరు గురించి కూడా చర్చిస్తారు. ఇరు దేశాలు కలిసి పనిచేయడం వల్ల కలిగే లాభాలను ప్రధాని బోరిస్​ వివరిస్తారు."

--- డౌనింగ్​ స్ట్రీట్​ ప్రకటన.

మిత్రపక్షమైన భారత్​కు బ్రిటన్​ ఎప్పుడు అండగా నిలుస్తుందని బోరిస్​ ఇప్పటికే ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చూడండి:- భారత్​కు అండగా.. సైకిల్​పై 'లండన్ టూ దిల్లీ'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.