ETV Bharat / bharat

డిగ్రీ అర్హతతో UIICలో 250 అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా! - degree jobs 2023

UIIC AO Jobs 2024 In Telugu : ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు అందరికీ గుడ్ న్యూస్​. యునైటెడ్​ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) 250 అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

UIIC AO Recruitment 2024 for 250 AO Jobs
UIIC AO Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 10:27 AM IST

UIIC AO Jobs 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ 'యునైటెడ్​ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ' (UIIC) 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేటగిరీలవారీగా ఉద్యోగాల వివరాలు

  • యూఆర్ - 102 పోస్టులు
  • ఓబీసీ - 67 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్ - 24 పోస్టులు
  • ఎస్సీ - 37 పోస్టులు
  • ఎస్టీ - 20 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 250

విద్యార్హతలు
UIIC AO Eligibility : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థల నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయితే చాలు.

వయోపరిమితి
UIIC AO Age Limit : అభ్యర్థుల వయస్సు 21 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
UIIC AO Fee :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 దరఖాస్తు రుసుముగా చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
UIIC AO Selection Process : అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
UIIC AO Salary : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్​ (స్కేల్​-1)లకు నెలకు రూ.50,925 నుంచి రూ.96,765 వరకు జీతం ఇస్తారు. గ్రాట్యుటీ, ఎల్​టీఎస్​, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్​ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్​, పెర్ఫార్మెన్స్​ లింక్డ్​ ఇన్సెంటివ్​​ (PLI), NPS లాంటి అదనపు బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు.

దరఖాస్తు విధానం
UIIC AO Application Process :

  • అభ్యర్థులు ముందుగా యునైటెడ్​ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్​సైట్​ https://uiic.co.in/ ఓపెన్ చేయాలి.
  • UIIC Administration Officer Apply Online Linkపై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన పత్రాలు అన్నింటినీ అప్లోడ్ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
UIIC AO Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 జనవరి 8
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 23
  • పరీక్ష తేదీ : 2024 ఫిబ్రవరి

NHPCలో ట్రైనీ ఇంజినీర్​, ఆఫీసర్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ఛాలెంజింగ్ జాబ్స్ చేయాలా? 2024లో ఉన్న టాప్-6​ కెరీర్ ఆప్షన్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.