ETV Bharat / bharat

ఉగాండా నుంచి వచ్చిన ఆమె బ్యాగ్​లో రూ.14కోట్ల హెరాయిన్​ - ఉగాండా మహిళ హెరాయిన్

Uganda woman with heroin: ఉగాండా నుంచి దిల్లీ వచ్చిన మహిళ బ్యాగులో రూ.14కోట్లు విలువ చేసే హెరాయిన్​ గుర్తించారు కస్టమ్స్ అధికారులు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు.

uganda-woman-with-heroin
ఉగాండా నుంచి వచ్చిన మహిళ బ్యాగులో రూ.14కోట్ల హెరాయిన్​
author img

By

Published : Dec 22, 2021, 4:35 PM IST

Uganda woman with heroin: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటంలో కస్టమ్స్ అధికారులు మరో కీలక విజయం సాధించారు. దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో ఉగాండా నుంచి వచ్చిన మహిళ బ్యాగులో రూ.14కోట్లు విలువ చేసే హెరాయిన్​ను గుర్తించారు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు.

ugandan-woman-with-heroin
ఉగాండా నుంచి వచ్చిన మహిళ బ్యాగులో రూ.14కోట్ల హెరాయిన్​

ఐజీఐ ఎయిర్​పోర్టు టర్మినల్ 3లో ల్యాండ్ అయిన అంతర్జాతీయ విమానం నుంచి దిగిన ఓ మహిళ వద్ద అనుమానాస్పద బ్యాగును గుర్తించి తనిఖీలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బ్యాగును తెరిచి చూస్తే 2కేజీల 20 గ్రాముల పౌడర్ ఉన్నట్లు చెప్పారు. దాన్ని పరీక్షిస్తే హెరాయిన్ అని తేలినట్లు పేర్కొన్నారు. ఆ ఉగాండా మహిళపై వెంటనే ఎన్​డీపీఎస్​ చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: నడిరోడ్డుపై మహిళ ముందు పాడు పని- హెడ్​ కానిస్టేబుల్​పై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.