మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. మంగళవారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, టీకాలు తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, పీడబ్ల్యూడీ మంత్రి అశోక్ చవాన్లు ఉండనున్నారు.
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గత నెల సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : 'అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషించండి'