ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం - total death of militants in this year

భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో ఈ ఘటన జరిగింది.

encounter in sri nagar
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​
author img

By

Published : Jul 16, 2021, 7:49 AM IST

Updated : Jul 16, 2021, 10:20 AM IST

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్​ దాన్మార్లోని అలందార్​ కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

encounter in sri nagar
శ్రీనగర్​లో భద్రతా సిబ్బంది
encounter in sri nagar
కొనసాగుతున్న భద్రతా సిబ్బంది సోదాలు

ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా సిబ్బంది.. ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ప్రాంతంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

encounter in sri nagar
శ్రీనగర్​లో మోహరించిన భద్రతా బలగాలు

ఇప్పటివరకు 78 మంది..

శుక్రవారం చనిపోయిన ఈ ఇద్దరు ఉగ్రవాదులతో కలిపి.. జమ్ముకశ్మీర్​లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 78 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు.

"ఈరోజు ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఎన్​కౌంటర్​లో హతమయ్యారు. భద్రతా బలగాలు, పోలీసులు కలిసి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 78 మంది ముష్కరులను మట్టుబెట్టారు."

-కశ్మీర్​ ఐజీపీ, విజయ్​ కుమార్​

ఎన్​కౌంటర్​లో మరణించిన 78 మంది ఉగ్రవాదుల్లో 39 మంది.. లష్కరే తోయిబా, హిజ్బుల్​ ముజాహిదీన్​, అల్​బదర్​, జైషే మహ్మద్​, అన్సార్​ గజ్వాత్​ ఉల్​ హింద్ ఉగ్రసంస్థలకు చెందినవారేనని విజయ్​ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి: డ్రోన్ల దాడిపై విచారణ- ఆర్డీఎక్స్ వాడారా​?

ఇదీ చూడండి: ఏకే-56తో లొంగిపోయిన ముష్కరుడు

Last Updated : Jul 16, 2021, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.