Two People Died due to Stadium Collapsed in Rangareddy : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం కూలింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ సమయంలో కూలి పని కోసం 14 మంది కూలీలు ఆ ప్రదేశంలో పని చేస్తున్నారు. ఆడిటోరియం కూలడంతో 11 మంది కూలీలు పరుగులు తీశారు.
రాహుల్ గాంధీ సభకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా - ఒకరు మృతి
Two people Died in Rangareddy : ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఆడిటోరియం శిథిలాల్లో చిక్కుకున్నారు. అందులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన ఇద్దరిలో ఒక వ్యక్తి బిహార్‌కు చెందిన బబ్లూగా స్థానికులు గుర్తించారు. మరో వ్యక్తి బంగాల్‌కు చెందిన సునీల్‌గా గుర్తించారు. ఈ ఘటనలో చిక్కుకున్న కూలీలు బిహార్ వాసులుగా స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ప్రాంతాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డీఆర్‌ఎఫ్(DRF) బృందాలు టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం దగ్గర సహాయక చర్యలు చేపట్టాయి. స్లాబ్ కూలిపోవడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 21 వరకు టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. దీని కోసమే ఈ ఆడిటోరియమ్ నిర్మిస్తున్నారు.
కళ్లెదుటే కవలలు దుర్మరణం - కోమాలోకి వెళ్లిన తల్లి
నాంపల్లి బజార్‌ఘాట్‌లో అగ్నిప్రమాద ఘటన - ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే యజమానిపై చర్యలు