Panna Acid Attack: బాలిక కళ్లల్లో జిల్లేడు పాలు పోసి.. - పన్నా యాసిడ్ దాడి
ప్రేమికులకు సహకరించిందని ఓ బాలిక కళ్లల్లో జిల్లేడు పాలు(Acid Attack News) పోశారు ఇద్దరు కిరాతకులు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ పన్నాలో(Panna Acid Attack) ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్ పన్నాలో(Panna Acid Attack) దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ కళ్లల్లో జిల్లేడు పాలు పోసి దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు కిరాతకులు.
ఇదీ జరిగింది..
బరాహో గ్రామానికి చెందిన ఓ దళిత బాలికపై యాసిడ్ దాడి(MP Acid Attack) జరిగినట్లు తొలుత వార్తలొచ్చాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా.. తనపై దాడి జరిగినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. తమ కుటుంబంలోని ఓ యువతి పారిపోయేందుకు సాయం చేసిన కారణంగా నిందితులు తనను నర్సరీకి తీసుకెళ్లి.. కళ్లల్లో యాసిడ్ లాంటి పదార్థం పోశారని బాధితురాలు పేర్కొంది.
అయితే.. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పన్నా ఎస్పీ ధర్మరాజ్ మీనా తెలిపారు. బాలిక కళ్లలో 'జిల్లేడు పాలు' పోశారని వెల్లడించారు.
హోంమంత్రి ఆగ్రహం..
"ఇది చాలా బాధాకరమైన ఘటన. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జిల్లేడు పాలు, డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో బాలికపై దాడి చేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. బాలిక చర్మంపై ఇది ప్రభావం చూపించింది. ప్రస్తుతం బాధితురాలి కళ్లకు ఎలాంటి నష్టం జరగలేదు. కంటిచూపు కూడా బాగానే ఉంది. చిత్రకూట్ కంటి ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాలికను.. మరో 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు డాక్టర్లు తెలిపారు."
-నరోత్తమ్ మిశ్రా, మధ్యప్రదేశ్ హోంమంత్రి
బాధితురాలిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లినట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. బాలిక చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: