ETV Bharat / bharat

పాపం.. ఐస్​క్రీం బాక్స్​లో చిక్కుకొని పిల్లలు మృతి - కర్ణాటక మైసూర్ వార్తలు

కర్ణాటకలోని మైసూరు జిల్లాలో విషాదం జరిగింది. దాగుడుమూతల ఆటలో భాగంగా ఐస్​క్రీం బాక్స్​లోకి దూరిన బాలికలు అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.

ice cream
దాగుమూతల
author img

By

Published : Apr 27, 2022, 11:04 PM IST

ఐస్​క్రీం బాక్స్​లో చిక్కుకొని ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. బాక్స్​ తలుపు లాక్​ అవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. కర్ణాటక మైసూరు జిల్లాలోని మసాజే గ్రామంలో ఈ విషాదం జరిగింది. మృతులను.. భాగ్య (12), కావ్యగా (7) గుర్తించారు. భాగ్య.. నాగరాజు-చిక్కదేవమ్మ దంపతుల కుమార్తె కాగా.. కావ్య, రాజనాయక-గౌరమ్మ దంపతుల కుమార్తె. వీరంతా అదే గ్రామానికి చెందిన వారు.

d
ఐస్​క్రీం బాక్స్​లో చిక్కుకొని బాలికల మృతి
d
పిల్లలు చిక్కుకున్న ఐస్​క్రీం బాక్స్​

దాగుడుమూతల ఆట ఆడుకుంటున్న భాగ్య, కావ్య.. ఆటలో భాగంగా దాక్కునేందుకు అక్కడే ఉన్న ఐస్​క్రీం బాక్స్​లోకి దూరారు. ఇంతలో ఆ బాక్స్​ మూతపడి లాక్​ అయింది. అరగంట సేపు తర్వాత పిల్లలు ఎంతకీ కనిపించకపోవడం వల్ల అనుమానం వచ్చి ఐస్​క్రీం బాక్స్ తెరిచి చూసేసరికి ఆ బాలికలు విగతజీవులుగా పడి ఉన్నారు. బాక్స్​లో ఊపిరి ఆడకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు జరగడం వల్ల ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదును చేయలేదు.

ఇదీ చూడండి : ముహుర్తం టైం దాటినా బరాత్​లో స్టెప్పులు.. వరుడ్ని చితకబాది, పెళ్లి క్యాన్సిల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.