పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కు చెందిన ఇద్దరు బాలికలు అనుకోకుండా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించారు. ఆదివారం తెల్లవారుజామున జమ్ముకశ్మీర్ పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన భారత భద్రతా దళాలు.. దేశంలోకి ప్రవేశించిన బాలికలను గుర్తించి అడ్డుకున్నాయి. ఈ క్రమంలో వారికి ఎలాంటి హాని జరగకుండా సంయమనం పాటించి, వివరాలు తెలుసుకున్నారు జవాన్లు.
ఆ బాలికలను పీఓకే ఫార్వర్డ్ కహుటా తహసీల్‌లోని అబ్బాస్పుర్కు చెందిన లైబా జబైర్ (17), సనా జబైర్ (13)గా గుర్తించారు.
వారిని త్వరగా తిరిగి స్వస్థలానికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:'భారత్ నాయకత్వంలో ఆ లక్ష్యాలు సాధ్యమే'