సాధారణంగా అమ్మాయిల కోసం కుర్రాళ్లు గొడవకి దిగుతుంటారు. కానీ అందుకు భిన్నంగా బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతులు కొట్టుకున్నారు. నడి రోడ్డు మీదే బాహాబాహీకి దిగి కొద్ది క్షణాలు అక్కడ గందరగోళం సృష్టించారు. వారికి సర్దిచెప్పేందుకు ఓ యువకుడు మరో యువతి ప్రయత్నించారు. అతి కష్టం మీద వారిని విడదీశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని సరాయకేలా ఛాండిల్ బజార్లో బుధవారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి యువతులు పరారయ్యారు. ఆ అమ్మాయిలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. యువతులు అదే ప్రాంతానికి చెందిన వారై ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి : యూట్యూబ్ చూసి హెలికాప్టర్ తయారీ- టెస్ట్ చేస్తూ మృతి