ETV Bharat / bharat

ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న మరుగుజ్జు అజీమ్​.. ఆ విషయంలో మాత్రం.. - అజీమ్​ మన్సూరీ వివాహం

పొట్టిగా ఉండటం వల్ల తనకు వివాహం కావడం లేదంటూ వార్తల్లో నిలిచిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అజీమ్​ మన్సూరీ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్నాడు. తనకు ఎంతగానో సహాయం చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ మిఠాయిలు అందించాడు.

Etv Bharat
ఉత్తర్​ప్రదేశ్​ మరగుజ్జు అజీమ్​ మన్సూరీ
author img

By

Published : Nov 2, 2022, 9:49 PM IST

పొట్టిగా ఉండటం వల్ల తనకు వివాహం కావడం లేదంటూ వార్తల్లో నిలిచిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మరుగుజ్జు యువకుడు అజీమ్​ మన్సూరీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. రెండున్నర అడుగులు ఉన్న అజీమ్​కు హాపుర్​ ప్రాంతానికి చెందిన బుష్రాను నవంబర్ 7న పెళ్లి చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అజీమ్​ను వరుడిగా ముస్తాబు చేశారు. పెళ్లికొడుకు దుస్తుల్లో మెరిసిపోయాడు అజీమ్​. యువతి దొరికినా ఇంట్లోవాళ్లు పెళ్లి చేయడం 2019 నుంచి.. లేదని చాలా సార్లు పోలీస్​స్టేషన్​కు వెళ్లాడు అజీమ్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.

two-and-half-feet-azim-mansoori-became-groom-azim-mansoori-marriage
పెళ్లి కొడుకుగా మారిన అజీమ్​
two-and-half-feet-azim-mansoori-became-groom-azim-mansoori-marriage
ఉత్తర్​ప్రదేశ్​ మరగుజ్జు అజీమ్​ మన్సూరీ

పెళ్లి చేసుకోబోతున్న సంతోషంలో ఊరేగింపుగా హాపుర్​కు బయల్దేరాడు అజీమ్ మన్సూరి. కారును పూలతో అందంగా అలంకరించాడు. ఖరీదైన షేర్వానీ ధరించి.. తన కుటుంబ సభ్యులు, బంధువులతో హాపుర్ వెళ్తున్నాడు. నవంబర్ 7న వివాహం జరగనుందని తెలిపాడు. అదేరోజు సాయంత్రంలోగా తిరిగి అందరం కలిసి ఇంటికి చేరుకుంటామని చెప్పాడు అజీమ్. ఈ సందర్భంగా కాబోయే భార్యకు ఓ సర్​ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అజీమ్. ఆమెకు బంగారు ఉంగరాన్ని ఇవ్వనున్నట్లు తెలిపాడు.

కారులో ఊరేగింపుగా వెళ్తున్న అజీమ్​

అయితే, తన పెళ్లి విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నాడు అజీమ్. వివాహానికి దేశ ప్రధాని, యూపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని అజీమ్ తొలుత భావించాడు. యూపీలోని ఇతర రాజకీయ ప్రముఖులకు సైతం ఆహ్వానం పలకాలని అనుకున్నాడు. అయితే, ఇప్పుడు వారిని పిలవలేకపోతున్నట్లు తెలిపాడు అజీమ్. వివాహం జరిగిన తర్వాత అయినా.. వారిని తప్పక కలుస్తానని చెబుతున్నాడు. తనకు ఎంతగానో సహాయం చేసిన పోలీసులకు స్వీట్​ బాక్స్​లను అందించాడు అజీమ్. అయితే, తన భార్యను హనీమూన్​కు తీసుకెళ్లనని... మక్కాకు వెళ్లి ప్రార్థనలు చేసి కుటుంబంతో సంతోషంగా ఉంటానని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.